Telugu Mirror : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. కార్తీక దీపం సీరియల్ తర్వాత అదే సమయానికి టెలికాస్ట్ అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ తో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది. దాని తర్వాత గుప్పెడంత మనస్సు సీరియల్ కి మంచి రేటింగ్ కూడా ఉండేది కానీ సీరియల్ టైమింగ్స్ మారాయి కాబట్టి రేటింగ్ లో కాస్త తగ్గింది.
అయినప్పటికీ గుప్పెడంత మనస్సు సీరియల ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వసుధారని దెబ్బకొట్టడానికి శైలేంద్ర, రావీజ్ డీల్ చేసుకున్న విషయం తెలిసిందే. వసుధారా ఎండీ అయ్యాక మొదటిసారి కాలేజీలో ఫెస్ట్ జరగబోతుంది. జగతి మేడం, రిషి సర్ లేకుండా ఈసారి వసుధారా ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తుంది. దీన్ని అలుసుగా తీసుకొని శైలేంద్ర, వసుధారా బావ అయిన రాజీవ్ ఫెస్ట్ సక్సెస్ అవ్వకుండా ఉండాలని ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు.
వసుధారా ఒంటరిగా..
రిషి, జగతి మేడం ఇద్దరు పక్కన లేరు అనే దిగులు ఉన్నప్పటికీ వసుధారా తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తుంది. శైలేంద్ర కాలేజీలో ఉన్న వసుధారా దగ్గరికి వచ్చి కాలేజీలో నువ్వు జరిపించే ఈ ఫెస్ట్ విజయవంతం కాదని, ఎండీ స్థాయికి నువు సరిపోవు అంటూ ఆమెని బాధపెట్టేలా మాట్లాడతాడు. కానీ వసుధారా శైలేంద్ర మాటలకు భయపడకుండా మాటకు మాటకు మాట్లాడి శైలేంద్రకి కౌంటర్ వేసింది. మావయ్య మహేంద్ర వద్దకు వచ్చి శైలేంద్ర మాట్లాడిన మాటలు వసుధారా చెప్పింది.
ఇక రాజీవ్ వసుధారా మీద ఉన్న కామంతో వసుధారను చూడడానికి ఫుడ్ డెలివరీ బాయ్ గా వస్తాడు. మాస్క్ పెట్టుకొని రావడంతో వసుధారా అతన్ని అంతగా గమనించలేదు. కానీ ఎందుకో వసుధారకి అనుమానం వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూశాను మాస్క్ తీయండి అని అడిగింది. మహేంద్ర వసుధారణి పిలవడంతో రాజీవ్ తప్పించుకున్నాడు.
ఫెస్ట్ విజయవంతంగా జరిపించాలని వసుధారా అన్ని పనులు జాగ్రత్తగా తనే దగ్గర ఉండి చూసుకుంటుంది. మరి ఈ ఫెస్ట్ సక్సెస్ అవుతుందా లేక శైలేంద్ర, దేవయాని వేసే ప్లాన్లతో వసుధారా ఇబ్బందుల్లో పడుతుందా అనేది వేచి ఉండాలి.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…