Amla Juice : ఉసిరి రసం ఇలా తీసుకోండి ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Amla Juice : Take amla juice for health benefits
image credit : India.com

ఉసిరికాయ (Amla) లలో విటమిన్- సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ బయోటిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఉసిరికాయ లో ఔషధ (medicine) గుణాలు కూడా మెండుగా (better) ఉన్నాయి.
ఉసిరికాయను ప్రతిరోజు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి ని పెంచుతుంది.జీర్ణ క్రియను మెరుగుపరచడం తో పాటు చర్మ సౌందర్యం (beauty) ను కూడా పెంచుతుంది.

ఉసిరి రసం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం:

ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఉసిరి రసాన్ని (Amla juice) త్రాగడం వల్ల శరీరానికి చాలా ఉపయోగాలు కలుగుతాయి. పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల రోగనిరోధక (Immunity) శక్తి బలపడుతుంది. తద్వారా వ్యాధులు (Diseases) బారిన పడకుండా కాపాడుతుంది.

పరగడుపున ఉసిరి రసం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ (digestive system) పనితీరు సక్రమంగా ఉంటుంది. మలబద్ధక (Constipation) సమస్యలను నివారిస్తుంది.

Also Read : ‘టీ’ ని పదే పదే వేడిచేసి త్రాగుతున్నారా? అయితే మీరు అనారోగ్యానికి దగ్గరవుతున్నట్లే

బరువు తగ్గడానికి (lose weight) మరియు శరీరం ఫిట్ గా ఉండడానికి ఉసిరి రసం ప్రతిరోజు పరగడుపున తాగడం అలవాటు చేసుకోవాలి.

ఉసిరి రసం ప్రతిరోజు త్రాగడం వలన ఐరన్ లోపం (Iron deficiency) ఉంటే తగ్గిస్తుంది. ఫ్లూ మరియు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఉదయం పూట ఉసిరి రసం త్రాగడం వలన మంచి ఎనర్జీ డ్రింక్ లా పని చేస్తుంది. రోజంతా చలాకీగా (active), చురుకుగా ఉండేలా చేస్తుంది.

Amla Juice : Take amla juice for health benefits
image credit : SNAANA

పరగడుపున ఉసిరి రసం త్రాగడం వలన బరువును నియంత్రణలో (under control) ఉంచుకోవచ్చు. అలాగే శరీరం కూడా మంచి ఆకృతిని (shape) పొందుతుంది.

ఉసిరి రసం ప్రతిరోజు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మరియు జుట్టును కూడా దృఢంగా చేస్తుంది. జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. ఉసిరి రసం శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. మరియు కొలెస్ట్రాల్ (Cholesterol) ను తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది.

ఉసిరి రసం కంటి చూపును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఉసిరి రసం త్రాగడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడటం తో పాటు కంటిలో వచ్చే శుక్లాలు, చికాకు, పొడి కళ్ళు (dry eyes) వంటి సమస్యలను నివారిస్తుంది.

Also Read : Hair Grow Faster : “బయోటిన్ పౌడర్” మీ జుట్టును మందంగా పెంచుతుంది, చర్మానికి అందాన్ని ఇస్తుంది, వాడి చూడండి తేడా తెలుసుకోండి

ఉసిరి రసం తాగడం వలన మధుమేహం, గుండె జబ్బులు (Heart diseases), స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కాబట్టి ప్రతిరోజు ఉసిరి రసం త్రాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరియు చర్మం (skin) ను కాంతివంతంగా చేస్తుంది. అలాగే జుట్టు (hair) సమస్యలను కూడా నివారిస్తుంది.

గమనిక : ఈ కథనం వివిధ  మాధ్యమాల ద్వారా సేకరించి వ్రాయబడింది.  పాఠకులకు అవగాహన కల్పించడం కోసం తయారు చేయబడింది.  దీనిని పాటించే ముందు వైద్యులను సంప్రదించగలరు.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in