దంత క్షయం బాధిస్తుందా? దంత సమస్యల నుంచి ఉపశమనం కోసం సింపుల్ గా ఇలాచేయండి.!

చాలామంది రకరకాల దంత సమస్యలతో బాధపడుతుంటారు. ఎక్కువ మందిని అధికంగా బాధించే సమస్య క్యావిటీస్ దీనివల్ల దంతాల లో చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. ఆ తరువాత పంటి నొప్పి సమస్య మొదలవుతుంది. కాబట్టి దంతాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరమని అంటున్నారు దంత వైద్యులు.

పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు పంటి సమస్యతో బాధపడుతుంటారు. చాలామంది రకరకాల దంత (Dental) సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మందిని అధికంగా బాధించే సమస్య క్యావిటీస్ (Cavities) సమస్య. దీనివల్ల దంతాలలో చిన్న రంధ్రాలు ఏర్పడతాయి.

దంతాలలో రంధ్రం (Hole) ఏర్పడడానికి ప్రధాన కారణం వాటిలో ఇరుక్కున్న ఆహారం. దంతాల లో ఆహారం ఉండడం వల్ల బ్యాక్టీరియా  (Bacteria) వృద్ధి చెందుతుంది. తద్వారా కొన్ని రోజులలో పంటి లో రంధ్రం ఏర్పడుతుంది. ఆ తరువాత పంటి నొప్పి సమస్య మొదలవుతుంది. కాబట్టి దంతాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరమని అంటున్నారు దంత వైద్యులు.

ఆహారం తిన్న తర్వాత పళ్ళ ల్లో ఆహారం ఇరుక్కుని ఉంటుంది. అప్పుడు పళ్ళను శుభ్రం చేయకపోవడం వలన బ్యాక్టీరియా తయారవుతుంది. పళ్ళ ల్లో స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ (Streptococcus Mutans) అనే బ్యాక్టీరియా తయారవుతుంది. తద్వారా దంత క్షయం ఏర్పడుతుంది.

Does tooth decay hurt? Do this simple to get relief from dental problems.
Image Credit : Vista Dent

దంత సంరక్షణకు మరియు పంటి మీద ఉన్న ఎనామిల్  (Enamel) దెబ్బతినకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలు పాటించండి.పళ్ళ సమస్యల నుంచి బయటపడడానికి షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ (Sugar free chewing gum) తినవచ్చు.ఈ చూయింగ్ గమ్ లో స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ అనే బ్యాక్టీరియాని వృద్ధి కాకుండా నిరోధించే సమ్మేళనం ఉంది. పంటి మీద ఉన్న ఎనామిల్ ను కూడా కాపాడుతుంది.

దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ -D, ఫాస్ఫరస్, క్యాల్షియం తీసుకోవడం అవసరం. విటమిన్ – డి దంతాలలో  ఉన్న క్యావిటి సమస్యను తగ్గించడంలో తోడ్పడుతుంది. కాబట్టి విటమిన్- డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఫ్లోరైడ్ (Fluoride) దంతాలను క్యావిటీస్ రాకుండా కాపాడుతుంది. మరియు పంటి మీద ఉన్న ఎనామిల్ పోకుండా రక్షిస్తుంది. కాబట్టి ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ ని ఎల్లప్పుడూ ఉపయోగించడం దంతాల ఆరోగ్యానికి మంచిది.

వెల్లుల్లి కూడా క్యావిటీస్ సమస్యల నుంచి దంతాలను రక్షిస్తుంది. వీటిలో యాంటీ ఫంగల్ (Anti Fungal), యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వలన అనేక రకాల దంత సమస్యలనుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Also Read : Wrapping Food In News Paper : పేపర్ లో చుట్టిన ఆహారం, చేస్తుంది ఆరోగ్యానికి హానికరం

‘టీ’ ని పదే పదే వేడిచేసి త్రాగుతున్నారా? అయితే మీరు అనారోగ్యానికి దగ్గరవుతున్నట్లే

దంత సమస్యలు ఉన్నప్పుడు ఉప్పు నీటిని (Salt Water)వాడవచ్చు. ఉప్పునీరు బాక్టీరియాని నాశనం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఉప్పు నీరు నోటి లోపల ఆమ్లం, PH సమతుల్యతను  నిర్వహించేలా దోహదపడుతుంది. క్రమం తప్పకుండా ఉప్పు నీళ్లను పుక్కిలించడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన పళ్ళ ల్లో ఉన్న పుచ్చు లు తగ్గిపోతాయి.

కాబట్టి దంతాలను శుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రతి ఒక్కరు శ్రద్ధ (Care)  తీసుకోవడం చాలా  అవసరం. లేదంటే పంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Comments are closed.