Donkey Milk Benefits : విశేష గుణాలున్న గాడిద పాలు.. పిల్లలకు, పెద్దలకు అందం..ఆరోగ్యం

గాడిద పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉండి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వీటిని త్రాగడం వల్ల పిల్లలకు మరియు పెద్దవారికి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వీటివల్ల అనారోగ్య సమస్యలు రావని చాలామంది భావిస్తారు. గాడిద పాలను త్రాగడం వలన శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

గాడిద (Donkey) పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉండి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వీటిని త్రాగడం వల్ల పిల్లలకు మరియు పెద్దవారికి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వీటివల్ల అనారోగ్య సమస్యలు రావని చాలామంది భావిస్తారు.

గాడిద రోజుకు ఒక లీటర్ పాలను మాత్రమే ఇస్తుంది. అంతేకాకుండా గాడిద పాలలో పోషక విలువలు (Nutritional values) సమృద్ధిగా ఉన్నాయి.

గాడిద పాలను త్రాగడం వలన శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

గేదెపాలు మరియు ఆవు పాలు త్రాగడం వలన ఎలర్జీ వచ్చేవారు గాడిద పాలు (donkey milk) త్రాగవచ్చు. గాడిద పాలలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి1, బి2 అధికంగా ఉన్నాయి. గాడిద పాలు త్రాగడం వలన శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారికి అద్భుతమైన పరిష్కార మార్గం అని చెప్పవచ్చు.

Also Read : Sweaty Palms And Hands : కాళ్ళు చేతులకు అధిక చెమట పడుతుందా? మీ సమస్యకు పరిష్కారం ఇక్కడ ఉంది.

గాడిద పాలు దంత సమస్యలకు మరియు కంటి సమస్యలకు అలాగే సంతానోత్పత్తి (Fertility) కి సంబంధించిన వ్యాధుల నివారణకు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. ఇవే కాకుండా పొట్ట సమస్యలను కూడ తగ్గించడంలో సహాయ పడతాయి‌
గాడిద పాలను బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. వీటివల్ల ముఖంపై ఉన్న ముడతలను నిర్మూలించడంలో చాలా బాగా పనిచేస్తాయి.

Donkey Milk Benefits : Donkey milk with special properties.. Beauty for children and adults.. Health
Image credit : Vijaya Karnataka

గాడిద పాలలో కొవ్వు పదార్థాలు (fatty substances) తక్కువగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల శరీరానికి క్యాలరీలు మరియు విటమిన్ డి అధిక మొత్తంలో అందుతుంది.

దగ్గు, జలుబు, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారికి గాడిద పాలను తాగడం వలన ఉపశమనం (relief) కలుగుతుంది. మరియు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలను వాడతారు.

Also Read : Muscle Cramps In Sleep : నిద్రలో కండరాలు లేదా పిక్కలు పట్టేస్తుంటే ఈ చిట్కాలు పాటించడం ద్వారా చక్కటి ఉపశమనం పొందండి

కాబట్టి గాడిద పాలను త్రాగడం వలన కొన్ని రకాల అనారోగ్య (sick) సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కనుక ఆవుపాలు మరియు గేదె పాలే కాకుండా గాడిద పాలన త్రాగేందుకు ప్రయత్నించాలి.

ఈ గాడిద పాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి లభిస్తాయి.

గమనిక : ఈ కధనం వివిధ మాధ్యమాల లో సేకరణ ద్వారా ఇవ్వబడింది. కధనం లోని అంశాలను ప్రయత్నించాలి అనుకుంటే నిపుణులను సంప్రదించండి.

Comments are closed.