Drumstick Flowers : మునగ పువ్వులతో ఇలా చేస్తే మిమ్మల్ని మీ భాగస్వామి తట్టుకోవడం ఇక కష్టమే

Drumstick Flowers : సీజన్ మారుతున్న సమయంలో వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ మరియు సీజనల్ వ్యాధులు శరీరం పై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. వేసవికాలం రాబోతుంది. ఈ సీజన్లో జలుబు, జ్వరం మరియు చికెన్ పాక్స్, స్ప్రింగ్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. తాజా పండ్ల నుండి కూరగాయల వరకు అన్ని రకాల ఆహారాలను తినడం వల్ల అనేక రకాల వ్యాధులను నివారించవచ్చు.

Drumstick Flowers : వేసవికాలం (summer season) రాబోతుంది. వసంత గాలులు వీస్తున్నాయి. సీజన్ మారుతున్న సమయంలో వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ మరియు సీజనల్ వ్యాధులు శరీరం పై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ సీజన్లో జలుబు మరియు జ్వరం రావడం చాలా సాధారణంగా వచ్చే సమస్య. అంతేకాకుండా చికెన్ పాక్స్, స్ప్రింగ్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. కాబట్టి అంటు వ్యాధులు (Infectious diseases) వ్యాపించకుండా, నివారించాలంటే దానికి సరైన మార్గం ఆహారం. తాజా పండ్ల నుండి కూరగాయల వరకు అన్ని రకాల ఆహారాలను తినడం వల్ల అనేక రకాల వ్యాధులను నివారించవచ్చు.

వసంతకాలంలో వచ్చే వ్యాధులను నిర్మూలించడానికి ఉపయోగపడే ఆహారాలలో మునగ పువ్వులను ఒకటిగా పరిగణించవచ్చు. మునగ పువ్వులు (Drumstick flowers) లభించేది ఈ సీజన్ లోనే. అది కూడా కేవలం కొన్ని వారాలు మాత్రమే లభిస్తాయి. కాబట్టి ఈ సమయంలోనే మునగ పువ్వులను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఎందుకనగా వ్యాధులు సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Drumstick flowers లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఎ, బి1,బి2, బి3, విటమిన్ సి కూడా ఉంటాయి. ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా ఈ పువ్వులలో ఉంటాయి. బ్యాక్టీరియా తో పోరాడే ప్రత్యేక సామర్థ్యాన్ని ఈ మునగ పువ్వులు కలిగి ఉంటాయి. మునగ పువ్వులు శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగు చేయడంలో చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి ఈ సీజన్ లో వీటిని తినడం వలన జలుబు, జ్వరం వంటివి దరి చేరకుండా నివారించవచ్చు.

Drumstick Flowers : Like drumstick flowers
Image Credit : YT/ Jinoos Kitchen

మునగ పువ్వులను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు, ఎముకలను దృఢంగా చేయడానికి సహాయపడతాయి. ఈ పువ్వులు తినడం వల్ల శరీరం యొక్క మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇవి ఆరోగ్య ప్రయోజనాల కోసమే కాకుండా పురుషులలో లైంగిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పడేలా చేస్తాయి అనే విషయం కొందరికి మాత్రమే తెలుసు.

మగవారిలో లైంగిక ఆరోగ్యాన్ని (Sexual health) మెరుగుపరచడానికి చక్కటి ఔషధం మునగ పువ్వులు అని అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ద్వారా తెలిసింది. టెరిగోస్పెర్మిన్ అనే సమ్మేళనం వంధ్యత్వ (Infertility) సమస్యలను తొలగించి, స్పెర్మ్ కౌంట్ ను పెంచడంతోపాటు వాటి యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుంది. లైంగిక జీవితం ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ మునగ పువ్వులు చాలా కీలకమైనవి.

Also Read : Marital sex life : మీ దాంపత్య లైంగిక జీవితానికి బూస్టింగ్ ఇచ్చే పండ్లు ..

మునగ పువ్వులను వేయించి లేదా పచ్చడి చేసుకొని తింటారు. ఈ విధంగా తినడం వలన రోగ నిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. అయితే లైంగిక జీవితాన్ని ఆరోగ్యంగా గడపాలంటే మునగ పువ్వులను పాలల్లో ఉడికించి, యాలకుల పొడి వేసి కలుపుకొని త్రాగాలి. ఈ విధంగా ఒక గ్లాస్ మునగ పువ్వుల పాలు, త్రాగడం వల్ల శృంగార కోరికలు పెరుగుతాయి.

కాబట్టి ఈ మునగ పువ్వులను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన సీజన్లో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు, పురుషుల లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి కూడా చక్కగా దోహదపడతాయి.

గమనిక :

ఈ కథనం వివిధ మాధ్యమాల ద్వారా సేకరించి వ్రాయబడింది. వీటిని అనుసరించే ముందు నిపుణులను సంప్రదించగలరు.

Comments are closed.