Foods That Reduce Sperm Count : పురుషులలో వీర్యశక్తిని తగ్గించే ఆహార పదార్ధాలు, వీటికి దూరంగా ఉండండి సంతానోత్పత్తిని పెంచుకోండి

మారుతున్న జీవనశైలి, తీసుకునే ఆహార పదార్ధాలతో పురుషులలో వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోయి సంతాన లేమికి కారణమవుతున్నాయి. ఆహారంలో కొన్ని పదార్ధాలను తీసుకోవడం తగ్గించడం ద్వారా స్పెర్మ్ కౌంట్ తగ్గడానిని నిరోధించవచ్చు.

జీవనశైలిలో మార్పులు, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త అనారోగ్య సమస్యలు (Health Problems) పుట్టుకొస్తున్నాయి. పూర్వపు రోజుల్లో వ్యాధులు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. రోజుకో కొత్త రోగం బయటపడుతుంది.

నేటి కాలంలో పురుషులలో (Men) ఎక్కువగా కనిపిస్తున్న సమస్య శుక్రకణాలు తగ్గిపోవడం. నాణ్యతలేని ఆహారం తీసుకోవడం మరియు శారీరక శ్రమ (Physical Activity) లేకపోవడం, ఆల్కహాల్ (Alcohol) తీసుకోవడం, కాలుష్యం (Pollution) వంటి కారణాల వల్ల పురుషులలో శుక్రకణాలు తగ్గిపోతున్నాయి. దీంతో పిల్లల పుట్టడం సమస్యగా మారింది.
మనకు తెలియకుండానే తినే కొన్ని రకాల ఆహార పదార్థాల వలన స్పెర్మ్ కౌంట్ (Sperm Count) పడిపోతాయి.

స్పెర్మ్  కౌంట్ తగ్గించే ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం :

ఎనర్జీ డ్రింక్స్ మరియు సోడా :

కొంతమందికి డ్రింక్స్ (Drinks) తాగే అలవాటు బాగా ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ డ్రింక్, సోడాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ వంటి వాటిని తరచుగా తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల శుక్రకణాలు తగ్గిపోయే అవకాశం ఉన్నది అని ఒక అంచనా. డ్రింక్స్ లో చక్కెర (Sugar) స్థాయి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని పెంచేలా చేస్తుంది. తద్వారా స్పెర్మ్ (DNA) కి 30% వరకు హాని కలిగిస్తుంది. దీంతో శుక్రకణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పురుషులు వీలైనంతవరకు వీటిని తీసుకోవడం తగ్గిస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Also రీడ్ : మీ కండరాల సామర్థ్యం తోపాటు, టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరగాలంటే తీసుకోవలసిన ఆహారం

క్యాన్డ్ ఫుడ్ :

టిన్ (Tin) లలో, డబ్బాలలో నిలవ చేసే ఆహారాన్ని క్యాన్డ్  ఫుడ్ (Canned Food) అంటారు. వీటిలో బిస్పినాల్ (BPA) అనే పదార్థం ఉండటం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. దీంతో శుక్రకణాల పై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి పురుషులు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి.

Foods That Reduce Sperm Count : Foods That Reduce Sperm Count in Men, Avoid These to Increase Fertility
image credit : Culinary Careers

మాంసాహారం :

ప్రాసెస్ చేసిన మాంసాహారానికి దూరంగా ఉండాలి. ప్రాసెస్ (Process) చేసిన మాంసాహారం తింటే శుక్ర కణాలు తగ్గిపోతాయని  పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. మాంసాహార (Non-Veg) పదార్థాలలో సలామి, హాట్ డాగ్, బెకన్, బీఫ్ జర్కీ వంటివి శుక్రకణాల మీద ప్రతికూల ప్రభావం పడేలా చేస్తాయి.

పాలు :

కొవ్వు (Fat)ఎక్కువగా ఉన్న పాలు మరియు పాల ఉత్పత్తులు అనగా చీజ్ (Cheese), క్రీమ్ మిల్క్ వంటివి తీసుకున్నా కూడా శుక్ర కణాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Also Read : శృంగార సామర్ధ్యం పెరగాలంటే ఆహారంలో ఈ పండ్లను తీసుకోండి.

సోయా ఉత్పత్తులు :

సోయా లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ పిల్లలు కావాలనుకున్న వారు వీటిని తీసుకోకపోవడం మంచిదని వైద్యులు అంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ (Estrogen) మోతాదు ని పెంచి, టెస్టోస్టిరాన్ (Testosterone) స్థాయిలను తగ్గేలా చేస్తాయి. తద్వారా శుక్రకణాలు తగ్గిపోతాయి. శుక్రకణాలు తక్కువగా ఉన్నవారు సోయా ఉత్పత్తుల కు దూరంగా ఉండటం మంచిది.

కాబట్టి శుక్రకణా (Sperm Count) లు తక్కువగా ఉన్నా మరియు సంతాన లేమితో బాధపడుతున్న వారు ఇటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

Comments are closed.