ఫుడ్ పాయిజన్ వలన కడుపు నొప్పి వస్తే వంటింటి చిట్కాలతో తక్షణ ఉపశమనం పొందండి

కొంత మంది కడుపునొప్పితో బాధపడుతుంటారు. తరచుగా కడుపునొప్పి వస్తే దానికి ప్రధాన కారణం ఫుడ్ పాయిజన్ అని చెప్పవచ్చు. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వెంటనే ఈ చిట్కాలను పాటించినట్లయితే కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

కొంతమంది తరచుగా కడుపునొప్పితో బాధపడుతుంటారు. ఏం తినాలి అన్న ఆలోచిస్తారు మరియు భయపడుతుంటారు. ఇలా తరచుగా కడుపునొప్పి (stomach ache) వస్తే దానికి ప్రధాన కారణం ఫుడ్ పాయిజన్ అని చెప్పవచ్చు.

పదేపదే ఫుడ్ పాయిజన్ సమస్య ఎదుర్కోవలసి వస్తుంటే, ఆహారం తీసుకునే విషయంలో చాలా శ్రద్ధ అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే సమస్య మరింత జఠిలం (hard) అయ్యే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫుడ్ పాయిజన్ సమస్య నుండి బయటపడటానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి అని చాలామందికి తెలియదు.

ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వెంటనే ఈ చిట్కాలను పాటించినట్లయితే కడుపునొప్పి నుంచి ఉపశమనం (relief) పొందవచ్చు.

కడుపులో నొప్పి ఉన్న సమయంలో నూనెలో వేయించిన పదార్థాలకు మరియు మసాలాలకు దూరంగా ఉండాలి.

తరచుగా ఫాస్ట్ ఫుడ్ మరియు ప్రాసెసింగ్ ఫుడ్ తీసుకోవడం, ఆహారాన్ని సరిగా నిల్వ చేయకపోవడం, వండే విధానం సరిగా లేకపోవడం వల్ల మరియు రక రకాల కారణాల వల్ల ఆహారం కలుషితమవుతుంటుంది.

Also Read : అందమైన చామంతి పూలు ఆరోగ్యానికి కూడా చేస్తాయి ఎంతో మేలు.

Get instant relief from stomach ache due to food poisoning with these kitchen tips
Image Credit : Pharm Easy

ఫుడ్ పాయిజన్ వల్ల కడుపునొప్పి సమస్య వచ్చిన వెంటనే నిమ్మరసం తాగాలి. ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం మరియు చక్కెర కలుపుకొని తాగినట్లయితే కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా తాగవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ ని వేడి నీటిలో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది. దీనిని తాగడం వల్ల కడుపునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

విరోచనాలు (Antics) అధికంగా అవుతుంటే శరీరంలో పొటాషియం తగ్గుతుంది. శరీరంలో తగినంత పొటాషియం లేకపోతే శరీరం బలహీనంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితులలో వెల్లుల్లిను కూడా తీసుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. నోట్లో ఒక వెల్లుల్లి (garlic) రెబ్బ వేసుకొని గోరువెచ్చని నీళ్లతో నమిలి మింగాలి. ఈ విధంగా చేయడం వల్ల పొట్ట సమస్యలు తగ్గిపోతాయి.

ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు శరీరంలో అజీర్తి, వాంతులు, విరోచనాలు, పొట్ట ఉబ్బరం, కడుపునొప్పి వంటి సమస్యలు బాధిస్తాయి.

తులసి ఆకులతో చేసిన టీ లేదా బ్లాక్ టీ ని తాగితే ఉపశమనం కలుగుతుంది. తురిమిన అల్లం మరియు కొద్దిగా జీలకర్ర (cumin) పొడిని మజ్జిగలో వేసి కలుపుకొని తాగిన కూడా ఫలితం ఉంటుంది.

Also Read : Ginger Garlic Soup : చలికాలంలో మజానిచ్చే అల్లం వెల్లుల్లి సూప్, హాయినిస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది .

ఫుడ్ పాయిజన్ వల్ల పొట్టలో ఇబ్బంది తగ్గేవరకు తాజా పళ్ళ రసాలను (Fresh juices) తాగడం వలన కూడా చక్కటి ఉపశమనం పొందవచ్చు.

కాబట్టి కలుషిత ఆహారం వల్ల కడుపునొప్పి సమస్య వచ్చినట్లయితే ఇటువంటి కొన్ని చిట్కాలను పాటించి కడుపునొప్పి సమస్య నుండి బయట పడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.

Comments are closed.