Motion Sickness : ప్రయాణంలో వాంతులు, వికారం ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేయండి హాయిగా ప్రయాణించండి

కొంతమంది ప్రయాణం చేయాలంటే భయపడతారు. ఎందుకనగా ప్రయాణం చేసేటప్పుడు వాంతులు, వికారం తల తిరగడం, కడుపులో తిప్పడం, నీరసంగా అనిపించడం వంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు.

కొంతమంది ప్రయాణం (journey) చేయాలంటే భయపడతారు. ఎందుకనగా ప్రయాణం చేసేటప్పుడు వాంతులు, వికారం (dumps), తల తిరగడం, కడుపులో తిప్పడం, నీరసంగా అనిపించడం వంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు.

కనుక ప్రయాణంలో ఇటువంటి సమస్యలు (problems) వస్తాయని ప్రయాణం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ తప్పని పరిస్థితిలో ప్రయాణం చేయవలసి వస్తే, ఏమీ తినకుండా ప్రయాణం చేస్తారు.

కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు ఇటువంటి సమస్యలు ఎదుర్కొనే వారికి ఆయుర్వేదంలో మంచి చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటించినట్లయితే ప్రయాణంలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ప్రయాణం చేసేటప్పుడు వచ్చే అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఆయుర్వేదంలో ఎటువంటి చిట్కాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Motion Sickness : Do you suffer from vomiting, nausea and other problems while travelling? Do this and travel comfortably
Image Credit : telugu mirror

అల్లం :

అల్లం (ginger) ను ఉపయోగించి వాంతులు, వికారం, సిక్ నెస్ వంటి సమస్యలను తొలగించుకోవచ్చు. ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రయాణం చేసేటప్పుడు జింజర్ క్యాండీ లను తింటూ ఉండాలి. వీటిని తినడం వల్ల ప్రయాణం సమయంలో కలిగే ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు.

Also Read : Raisins For Diabetics : మధుమేహం ఉన్నవారు ఎండు ద్రాక్ష తినడం మంచిదేనా? తెలుసుకోండి

ఉసిరికాయ :

ఉసిరి కాయలో విటమిన్ -సి సమృద్ధిగా ఉంటుంది‌. ఉసిరికాయ (Amla) రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు ఉసిరికాయను నోట్లో ఉంచుకొని కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వాంతులు, వికారం, కడుపులో తిప్పడం వంటి సమస్యలు రాకుండా ఉంచడంలో ఉసిరి చాలా బాగా పనిచేస్తుంది.

Also Read : Soaked Dry Fruits : ప్రతి రోజూ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మీ గుండె పదిలం.. శారీరక ఆరోగ్యం ధృడం

సోంపు :

సోంపు అందరి ఇళ్లల్లో ఉంటుంది. భోజనం చేసిన తర్వాత సోంపు (Anise) తింటే తిన్న ఆహారం చక్కగా జీర్ణం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రయాణ సమయంలో సోంపు ను వెంట తీసుకొని వెళ్ళండి. సోంపు న కొద్ది కొద్దిగా తింటూ ఉండండి. ప్రయాణంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు సోంపు కూడా చాలా బాగా పనిచేస్తుంది.

కాబట్టి ప్రయాణం చేసే సమయంలో వాంతులు (vomiting), వికారం, కడుపునొప్పి, తల తిరగడం వంటి సమస్యలతో బాధపడేవారు ఇటువంటి కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించినట్లయితే ప్రయాణంలో వచ్చే అనారోగ్య సమస్యల నుండి సులువుగా బయటపడవచ్చు.

Comments are closed.