Papaya Benefits : ఆరోగ్యానికి బొప్పాయి చేసే మేలు తెలిస్తే మీరిక వదిలిపెట్టరు.

బొప్పాయి పండు ధర తక్కువలో లభిస్తుంది. దీనిలో మానవ శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.అయితే పరగడపున బొప్పాయిని తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యంతోపాటు ఆరోగ్య సమస్యలు చాలా వరకు దరిచేరకుండా చూసుకోవచ్చు.

Papaya Benefits : స్థాయి తో సంభందం లేకుండా దొరికే పండు బొప్పాయి (Papaya). లక్షాధికారినుండి పేదవాడి వరకు కొనగలిగే పండు బొప్పాయి. బొప్పాయి పండు ధర కూడా స్వల్పమే అయినా ఇది అందించే మేలు మాత్రం అధికం. ఉదయాన్నే పరగడపున బొప్పాయిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) సమకూరతాయి. కేవలం ఒకటి రెండు రోజులు కాకుండా ఒక నెల రోజులు పాటు ఉదయాన్నే ఖాళీ పొట్టతో బొప్పాయిని తిని చూడండి. మీలో వచ్చే మార్పులను మీరు ప్రత్యక్షంగా గమనిస్తారు. బొప్పాయి పండుని ప్రతి రోజూ తీసుకోవడం వలన మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయిని తినడం వల్ల ఆ రోజు మొత్తం అందులో ఉండే పాపైన్ (Papain) వంటి ఎంజైమ్‌లు జీర్ణ క్రియకు సహాయపడతాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు జీర్ణమయ్యేందుకు పాపైన్ వంటి ఎంజైమ్‌లు చాలా అవసరం. పరగడపున బొప్పాయిని తినడం వల్ల ఈ ఎంజైములు మరింత ప్రభావం వంతంగా పనిచేస్తాయి. ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి.

రోగ నిరోధక శక్తికి బొప్పాయి :

Papaya Benefits

బొప్పాయిలో విటమిన్ సి (Vitamin C) అధికంగా ఉండటం మూలాన ఇది రోగనిరోధక శక్తిని బలంగా మారుస్తుంది. ఉదయాన్నే పరగడుపున బొప్పాయిని తినడం వలన తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయ కారిగా ఉంటుంది ఇవి ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలతో పోరాడడానికి సహాయపడతాయి.

బరువు తగ్గాలనుకునే వారికి బెటర్ ఛాయిస్ :

Papaya Benefits

బొప్పాయిలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. పరగడపున బొప్పాయిని తింటే ఆరోజు ఇతర ఆహారాన్ని తక్కువగా తింటారు. ఇలా చేయడం వలన క్యాలరీలను కూడా బర్న్ చేయవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి మంచి ఛాయిస్.

కాంతివంతమైన చర్మం కోసం :

Papaya Benefits

నిగారింపు కలిగి కాంతివంతమైన చర్మం కావాలనుకుంటే ప్రతిరోజూ బొప్పాయిని పరగడుపున తినడం అలవాటు చేసుకోండి. బొప్పాయిలో విటమిన్ సి, బీటా కెరటిన్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, బీటా కెరటిన్ చర్మాన్ని నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ నుండికాపాడతాయి. చర్మ సౌందర్యానికి మెరుపునిచ్చి, యవ్వనవంతంగా ఉంచుతాయి. చర్మం యొక్క రంగును మెరుగుపరచడమే కాకుండా చర్మ కణాలలో కూడా మెరుపును కలిగిస్తాయి.

జీర్ణ సమస్యలకు :

Papaya Benefits

బొప్పాయిని ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకోవడం మూలాన మలబద్దకం వంటి ఇబ్బందులతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. బొప్పాయిలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది దీనివలన తీసుకున్న ప్రతి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అదేవిధంగా పేగు కదలికలను కూడా ఉత్తేజ పరచి జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు దోహద పడుతుంది. దీనివల్ల మలబద్ధకం,అజీర్ణం, గ్యాస్ లాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

బొప్పాయితో హృదయం పదిలం : 

Papaya Benefits

పరగడుపున బొప్పాయిని తినడం అలవాటు చేసుకుంటే భవిష్యత్ లో హృదయ సమస్యలు కలుగకుండా చూసుకోవచ్చు. బొప్పాయిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించి హృదయనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది, తద్వారా గుండెపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

శరీర ఉత్సాహానికి బొప్పాయి :

 Papaya Benefits

బొప్పాయి పండును తినడం ద్వారా రోజును ప్రారంభించడం వల్ల శరీరానికి పుష్కలంగా జీవశక్తి అందుతుంది. విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ కె లాంటి వైటమిన్ లు శరీరానికి అందుతాయి. కాబట్టి మీరు నీరసం లేకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు. బొప్పాయి తిన్న వెంటనే దానిలో ఉండే సహజ చక్కెర్లు శక్తిని అందిస్తాయి దీంతో కాసేపటికే మీరు ఉత్సాహవంతంగా చురుగ్గా మారుతారు.

కంటి ఆరోగ్యానికి :

 Papaya Benefits

బొప్పాయి పండులో బీటా కెరాటిన్ కూడా అధికం. బొప్పాయి తీసుకోవడం ద్వారా బీటా కెరాటిన్ శరీరంలో చేరి విటమిన్ ఏగా మారుతుంది. కంటి ఆరోగ్యానికి విటమిన్ ఏ చాలా అవసరం. బొప్పాయిని పరగడపున తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Papaya Benefits

Comments are closed.