Pregnancy in Summer: వేసవిలో గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన ఆహార పదార్థాలు మరియు తినకూడని పదార్ధాలు తెలుసుకోండి.

Pregnancy in Summer: ప్రస్తుతం వేసవి కాలం భానుడి ప్రచండ కిరణాలతో ఎండ వేడిమి తీవ్రంగా ఉంది. వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీచేసిన క్రమంలో పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే గర్భంతో ఉన్నటువంటి వారు డీహైడ్రేషన్ కి గురికాకుండా ఎండాకాలంలో ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు అనేది తెలుసుకుందాం.

Pregnancy in Summer: మాతృత్వం అనేది ప్రతి స్త్రీ తన జీవితంలో ప్రధానంగా కోరుకునే ఒక అందమైన వరం. గర్భం దాల్చడం స్త్రీ జీవితంలో ఒక అత్యంత అందమైన అనుభూతిగా చెప్పవచ్చు. గర్భం దాల్చిన సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు అలాగే ఎన్నో భావోద్వేగాలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు వేసవిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్ కు గురికాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పోషకాహారాన్ని తీసుకుంటూ బిడ్డ ఆరోగ్యాన్ని, తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

వేసవికాలంలో గర్భంతో ఉన్న స్త్రీలు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు, సహజ చక్కెరలు నిండి ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి. వీటిని అధిక మోతాదులో ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. అదేవిధంగా జీర్ణ క్రియను, పేగు కదలికలను సులభతరం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. డైటీషియన్లు తెలిపిన వివరాల ప్రకారం వేసవిలో గర్భిణీలు క్రమం తప్పకుండా ఏవిధమైన ఆహారాన్ని తీసుకోవాలి? ఎలాంటి ఆహార పదార్థాలను దూరంగా పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

వేసవి కాలంలో డీ హైడ్రేషన్ కి గురి కాకుండా గర్భిణీలు తీసుకోవలసిన ఆహారం:

వేసవికాలంలో గర్భిణీలు పుచ్చకాయలను ప్రతిరోజూ తినాలి. పుచ్చకాయలు తినడం వల్ల శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను పెంచి డీహైడ్రేషన్ రాకుండా అడ్డుకుంటాయి. ఐరన్ అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచే నిమ్మకాయ రసం, కివీ పండ్లు, జామ, పీచ్, రేగు పండ్లు అధికంగా తింటూ ఉండాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆపిల్ పండ్లు ప్రతిరోజూ ఒకటి రెండు ఆపిల్ పండ్లు తినడం చాలా అవసరం, వీటి ద్వారా ఇనుము కూడా అందుతుంది. హెల్థీ ఫ్యాట్స్, ఫైబర్ అధికంగా ఉండే అవకాడో కూడా రోజుకు ఒకటి తినడం మంచిది. ఇక రోజుకు రెండు అరటిపండ్లు కూడా తినాలి. మామిడి పండ్లు తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ సి పోషకాలు పుష్కలంగా అందించే మామిడి పండ్లు తినడం కూడా మంచిదే అలాగే నీళ్లు అధికంగా తాగుతూ ఉండాలి. లస్సీ, కొబ్బరి నీరు, మజ్జిగ వంటివి అధికంగా తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

వేసవి కాలంలో గర్భిణీలు తీసుకోకూడని ఆహారం:

గర్భంతో ఉన్న వారు ఇంటిలో తయారుచేసిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. బయట దొరికే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి మిల్క్ షేక్స్ వంటి చక్కెర పానీయాలను తక్కువగా తీసుకోవాలి. పంచదార కలిసిన పానీయాలను, ఆహారాలను దూరం పెట్టాలి. సోడాలు త్రాగకూడదు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకూడదు. పంచదారలో జీరో క్యాలరీలు ఉంటాయి కనుక పంచదారతో చేసిన ఆహారాలను తీసుకోవడం పూర్తిగా మానివేయాలి వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు..వేసవిలో కాఫీ, టీలు శరీరాన్ని డిహైడ్రేషన్‌కు గురయ్యేలా చేస్తాయి. కాఫీ, టీలు కూడా పూర్తిగా మానేయడమే మంచిది. ఒక వేళ ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయడం మంచిది.

Pregnancy in Summer

 

 

 

Comments are closed.