Raisins For Diabetics : మధుమేహం ఉన్నవారు ఎండు ద్రాక్ష తినడం మంచిదేనా? తెలుసుకోండి

మధుమేహంతో బాధపడేవారు ఏమి తినాలన్నా మరియు త్రాగాలన్నా అనేక షరతులు ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్ష తినవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. డయాబెటిస్ పేషంట్స్ ఎండు ద్రాక్ష తినవచ్చా లేదా అనే విషయం తెలుసుకుందాం.

మధుమేహంతో బాధపడేవారు ఏమి తినాలన్నా మరియు త్రాగాలన్నా అనేక షరతులు (conditions) ఉంటాయి. డయాబెటిక్ సమస్యతో బాధపడేవారు బయట ఆహారాన్ని అసలు తినకూడదు. ముఖ్యంగా తీపి పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి.

చలికాలంలో డ్రై ఫ్రూట్స్ అధికంగా వాడతారు. ఈ కాలంలో బాదం, వాల్ నట్స్ మరియు ఎండు ద్రాక్ష తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే ఎండుద్రాక్ష ఇతర డ్రై ఫ్రూట్స్ కన్నా చాలా తీయగా ఉంటాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్ష (raisins) తినవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది.

డయాబెటిస్ పేషంట్స్ ఎండు ద్రాక్ష తినవచ్చా లేదా అనే విషయం తెలుసుకుందాం.

కొన్ని ఆహార పదార్థాల్లో ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెర లు ఉంటాయి. ఇటువంటి ఆహార పదార్థాలను షుగర్ పేషెంట్లు తినకూడదు. ఇటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు (Sugar levels) అకస్మాత్తుగా పెరుగుతాయి‌.

Also Read : Soaked Dry Fruits : ప్రతి రోజూ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మీ గుండె పదిలం.. శారీరక ఆరోగ్యం ధృడం

కాని ఎండుద్రాక్ష లో గ్లూకోజ్, ప్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. అయితే ఎండు ద్రాక్ష తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి అని సందేహ పడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ఎండు ద్రాక్షలో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది.

Raisins For Diabetics : Are raisins good for diabetics? Find out
Image Credit : Medical News To Day

ఎండు ద్రాక్షలో ఫైబర్ ఉండడం వల్ల చక్కెరను గ్రహించు కోవడం (Realizing) లో తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలంటే ఫైబర్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం చాలా ముఖ్యం.

మధుమేహ వ్యాధి గ్రస్తులలో జీర్ణ క్రియ మెరుగ్గా ఉండదు .కాబట్టి వారు ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి. తద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

Also Read : Diabetes : మధుమేహం ఉన్నవారు చర్మ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో తెలుసా?

ఎండు ద్రాక్షలో కేలరీలు కూడా ఉంటాయి‌ వీటిని అధికంగా తినకూడదు. ఎందుకనగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండు ద్రాక్షను మితంగా తినాలి.

ఎండుద్రాక్ష లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా అధికంగా ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు, గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి.

కాబట్టి డయాబెటిస్ తో బాధపడేవారు ఎండుద్రాక్ష తినవచ్చు. కానీ పరిమితం (Limited) గా మాత్రమే తినాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

గమనిక : ఈ కధనం వివిధ మాధ్యమాల ద్వారా సేకరించి ఇవ్వబడింది. దీనిని ప్రయత్నించేముందు నిపుణులను సంప్రదించండి.

 

Comments are closed.