Sweet Potato Benefits : రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే చిలగడ దుంప

ప్రకృతి మనకు అందించిన వాటిలో చిలగడ దుంపలు ఒకటి. ఈరోజు కథనంలో చిలగడ దుంపలు తినడం వల్ల ఎటువంటి ఉపయోగాలు మన శరీరానికి లభిస్తాయో తెలుసుకుందాం.

ప్రకృతి మనకు అందించిన వాటిలో చిలగడ దుంప (Sweet potato) లు ఒకటి. చిలగడ దుంపలను ఆంగ్లంలో స్వీట్ పొటాటో అని పిలుస్తారు. పేరుకు తగినట్టుగానే ఈ దుంపలు తియ్యగా ఉంటాయి.

పూర్వపు రోజులు వీటిని విరివిగా వాడేవారు. ఖాళీ సమయంలో స్నాక్స్ గా కూడా తినేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో వీటి వాడకం చాలా తక్కువ అయింది. కొంతమంది చిలగడదుంపలను ఉపయోగించి కూరలు కూడా చేసుకుని తినేవారు.

చిలగడదుంపలు రుచిగా ఉంటాయి మరియు వీటిలో పోషక విలువలు (Nutritional values) కూడా అధికంగానే ఉంటాయి. అయితే చిలగడ దుంపలు మనకు కేవలం చలికాలంలో మాత్రమే లభిస్తాయి. ఈ సీజన్ లో వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

ఈరోజు కథనంలో చిలగడ దుంపలు తినడం వల్ల ఎటువంటి ఉపయోగాలు (Uses) మన శరీరానికి లభిస్తాయో తెలుసుకుందాం.

చలికాలంలో చర్మ సంరక్షణ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనగా ఈ కాలంలో చర్మం అధికంగా పొడి బారుతూ ఉంటుంది కాబట్టి చర్మం అందవిహీనంగా కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా చర్మం ముడతలు (Wrinkles) పడి, కాంతిని కోల్పోతూ ఉంటుంది.

Sweet Potato Benefits: Sweet potato provides many health benefits along with taste
Image Credit : Saam TV

చర్మం కాంతిని కోల్పోకుండా మరియు ఇతర ఇబ్బందులు రాకుండా ఉండాలంటే చిలగడ దుంపలను తప్పకుండా తినాలి. వీటిని తినడం వల్ల చర్మం తేమను కోల్పోకుండా ఉంటుంది. ముడతలు తగ్గిపోయి చర్మం పొడిబారకుండా కాపాడడంలో చిలగడదుంపలు చాలా బాగా సహాయ పడతాయి‌. చలికాలంలో చిలగడదుంపలు తినడం వల్ల చర్మాన్ని చాలా బాగా రక్షిస్తాయి.

చిలగడ దుంపలలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ప్రోస్టేట్ అండాశయ (ovarian) క్యాన్సర్లు రాకుండా చేయడంలో సహాయపడతాయి. చిలగడ దుంపులను తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను పెంచేలా చేస్తాయి. ఇవి సహజంగానే వేడిని ఉత్పత్తి చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. కనుక వీటిని చలికాలంలో తినడం వలన శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి శరీరం వెచ్చగా ఉండేలా చేస్తుంది.

Also Read : Ginger Garlic Soup : చలికాలంలో మజానిచ్చే అల్లం వెల్లుల్లి సూప్, హాయినిస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది .

చలికాలంలో చిలగడదుంపలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్స్, వ్యాధులు, అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి‌ ఈ దుంపలలో కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల శరీరానికి సమర్థవంతమైన చికిత్సగా పనిచేస్తాయి.

చిలగడ దుంపలలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. వీటిని తిన్న తర్వాత వేరే ఇతర ఆహార పదార్థాలను తినలేం. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ దుంపలు చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతోపాటు రక్తపోటు (blood pressure) స్థాయిని కూడా నియంత్రణలో ఉంచుతుంది.

Also Read : Sweaty Palms And Hands : కాళ్ళు చేతులకు అధిక చెమట పడుతుందా? మీ సమస్యకు పరిష్కారం ఇక్కడ ఉంది.

గర్భిణీ స్త్రీలు చిలగడదుంపల్ని ఉడకబెట్టి తినడం వల్ల కడుపులో పెరిగే బిడ్డ (A child growing in the womb) కు మంచి పోషకాలు అందుతాయి. అలాగే ఈ దుంపలు తినడం వల్ల మహిళలలో సంతానోత్పత్తి ని పెంచడంలో కూడా సహాయపడతాయి.

కాబట్టి చలికాలంలో లభించే చిలగడదుంపలను ప్రతి ఒక్కరు తినడం వలన శరీరానికి చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా అందించవచ్చు.

గమనిక:

ఈ కథనం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడినది. పాఠకులకు జ్ఞానం మరియు అవగాహన పెంపొందించడానికి మాత్రమే. వీటిని అనుసరించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

Comments are closed.