Telugu Mirror : మన దేహాని(Body)కి అవసరమైన వైటమిన్(Vitamin) లలో అత్యంత అవసరమైన వాటిలో వైటమిన్-డి కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది. విటమిన్-డి(Vitamin-D) కి మరో పేరు ‘సన్ షైన్’ విటమిన్ అని కూడా అంటారు.ఈ విటమిన్ మన ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది.దేహానికి కాల్షియంను అందించడంలో విటమిన్-డి పాత్ర ఎంతో ముఖ్యమైనది.విటమిన్-డి మన శరీరం లోని ఇమ్యూనిటీ పవర్ పనితీరును పెంచుతుంది.శరీరానికి అవసరమైన మోతాదులో విటమిన్-డి ఇవ్వకపోతే ఎముకలు బలహీనంగా మారతాయి.అయితే విటమిన్-డి సప్లిమెంట్ ల కన్నా సూర్యకాంతి లో విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది.
Dal recipe : ఎంతో రుచికరమైన పప్పు..వండుకోండి ఇలా ..
సూర్య కాంతి ద్వారా లభించే విటమిన్-డి,ఇప్పుడు వర్షాకాలం లో ఎలా తీసుకోవాలి? తెలుసుకుందాం..
భారత దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్-డి లోపం కలిగి ఉన్నారని ఇటీవల జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. విటమిన్-డి లోపంతో భాధపడే వారు దాదాపు 76 శాతం మంది ఉన్నారని తేలింది. విటమిన్-డి లోపంతో భాధపడేవారిలో 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
విటమిన్-డి పొందాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి?
- మీ ఆహారం లో డైలీ గుడ్డు(Egg) తినాలి.గుడ్డు లోపలి భాగం (పచ్చ సొన)లో విటమిన్-డి ఉంటుంది.
- ప్రతి రోజూ పాలు(Milk) తాగడం అలవాటు చేసుకోవాలి.ఎందుకంటే పాలలో పోషకాలతో పాటు విటమిన్-డి కూడా అధిక శాతం లభిస్తుంది.
- మష్రూమ్ ను తినడం ద్వారా డీ-విటమిన్ లోపాన్ని తొలగించవచ్చు.
- అధికంగా సాల్మన్,ట్యూనా చేపలను తినాలి అదేవిధంగా రోజూ ఆహారంలో చేపలు ఉండే విధంగా మీ డైట్ ను ప్లాన్ చేసుకోవాలి.
- నారింజ పండ్లను తినాలి.దీనిలో విటమిన్-సి(Vitamin-C) అలాగే విటమిన్-డి కూడా లభిస్తుంది.దీనివలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
- ప్రతి రోజూ ఆహారంలో ఆకుకూరలు,సోయా, పాలు ఉండేలా చూసుకోవాలి.
- Parenting-Tips : మొక్కై వంగనిది మానై వంగునా..పిల్లల భద్రత పేరెంట్స్ చేతిలోనే..
డి-విటమిన్ ఎంత మోతాదులో తీసుకోవాలి:
- జీవ ప్రక్రియ నిర్వహించడం(మెటబాలిజం),ఆరోగ్యవంతమైన ఎముకలు,కాల్షియం(Calcium) సరిగా ఉండాలి అంటే శరీరానికి సరిపడా విటమిన్-డి అవసరం.
- బాల,బాలికలకు, యుక్త వయసులో ఉన్నవాళ్ళు 600 IU లేదా 15 మైక్రోగ్రాములు తీసుకోవాలి.
- 70 సంవత్సరాలు ఆపైన ఉన్న వారికి 800 IU (20MCG) విటమిన్-డీ తీసుకోవాలి.
- గర్భంతో ఉన్నవాళ్ళు,పాలిచ్చే తల్లులకు సుమారు 600 IU లేదా 15 MG విటమిన్-డీ అవసరం అవుతుంది.
- విటమిన్-డీ ని సప్లిమెంట్(Supplement) ల రూపంలో తీసుకోవాలి అనుకునే వారు వైద్యుల సూచన మేరకు వారానికి ఒకటి చొప్పున తీసుకోవాలి.