White Turmeric : క్యాన్సర్ కారకాలను, స్త్రీల సమస్యలను మరియు ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించే తెల్ల పసుపు.

వంటింటి ఔషధం పసుపు. వివిధ రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించడంలో పసుపు చాలా బాగా సహాయపడుతుంది. ప్రతి వంటలో పసుపు ను ఉపయోగించడం సర్వసాధారణం. కథనంలో తెల్ల పసుపు వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ప్రతి వంటలో పసుపు ను ఉపయోగించడం సర్వసాధారణం. చాలా రకాల వంటకాలలో పసుపు ను వాడకుండా వంట పూర్తి అవ్వదు. పసుపు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి లభిస్తాయి. వివిధ రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించడంలో పసుపు చాలా బాగా సహాయపడుతుంది.

అందరికీ అందుబాటులో ఉన్న మరియు మనకు తెలిసిన పసుపు, పచ్చ పసుపు (yellow Turmeric). పచ్చ పసుపుతో పాటు నల్ల పసుపు మరియు తెల్ల పసుపు కూడా ఉన్నాయి. అయితే తెల్ల పసుపు అనేది చాలా మందికి తెలియదు.

ఈరోజు కథనంలో తెల్ల పసుపు (White Turmeric) వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. తెల్ల పసుపులో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. స్త్రీలలో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా నయం చేయడంలో తెల్ల పసుపు చాలా బాగా దోహదపడుతుంది.

White Turmeric : White Turmeric prevents cancer, women's problems and many health problems.
ImageCredit : India MART

 

తెల్ల పసుపులో స్టార్చ్, కర్కుమిన్, సపోనిన్, చక్కెర వీటితో పాటు అనేక రకాలు ఇతర మూలకాలు ఉన్నాయి. దీనిలో జీర్ణకోశ వ్యాధులను వెంటనే తగ్గించే ఔషధ గుణాలు (Medicinal properties) ఉన్నాయి. తెల్ల పసుపులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కణాలలో ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతాయి.

ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలను తగ్గించడంలో తెల్ల పసుపు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర పరిమాణాన్ని కూడా నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

Also Read : Health Tips : తీవ్రంగా బాధించే టాన్సిల్స్ సమస్యను తేలికగా తగ్గించే మార్గాలు

కొన్ని శతాబ్దాలుగా తెల్ల పసుపు ను క్యాన్సర్ (Cancer) చికిత్సకు ఉపయోగిస్తున్నారు. శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాల పెరుగుదల నియంత్రణ మరియు చికిత్స చేయడానికి రెండింటికి సహాయపడుతుంది. తెల్ల పసుపులో ఉండే కర్కుసెటోలైడ్ అనేది క్యాన్సర్ ను నిరోధించడంలో బాధ్యత వహిస్తుంది.

అండాశయం (Ovary), రొమ్ము ,కడుపు క్యాన్సర్ లే కాకుండా ఇతర రకాల క్యాన్సర్లను కూడా నివారించడంలో తెల్ల పసుపు చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపితమైనది.

Also Read : Health Tips : స్వంతంగా టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? ముఖ్యంగా పారాసెటమాల్ అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే  

స్త్రీలలో, రుతు సమస్యల (Menstrual problems) వల్ల వచ్చే నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

తెల్ల పసుపును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది. తెల్ల పసుపు కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది. తెల్ల పసుపు సారం తాగడం వలన కాలేయ సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

White Turmeric : White Turmeric prevents cancer, women's problems and many health problems.
Image Credit : Wild turmeric

శరీరంపై వచ్చే వాపులను మరియు ఒత్తిడిని కూడా తగ్గించడంలో తెల్ల పసుపు చాలా బాగా పనిచేస్తుంది. పొట్టకు సంబంధించిన వివిధ రకాల సమస్యల నుండి బయటపడేందుకు తెల్ల పసుపు ను ఉపయోగిస్తారు.

అంతేకాకుండా తెల్ల పసుపు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను, మొటిమలు మరియు మచ్చలను తగ్గించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది.

Also Read : Health Tips : దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పాటు శరీర బరువును తగ్గించే దివ్యౌషదం బెల్లం టీ

కాబట్టి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు తెల్ల పసుపులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు దీనిని ఉపయోగించి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

గమనిక : ఈ కథనం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడింది. దీనిని అనుసరించే ముందు వైద్యుడిని సంప్రదించగలరు.

Comments are closed.