Telugu Mirror : తెలంగాణ లో ఈరోజు నుంచి 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని,తెలంగాణ(Telangana) లోని కొన్ని జిల్లాలలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో , ఎటువంటి ప్రాణ,ఆస్థి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ అలాగే మండలాల్లో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.
వాతావరణ శాఖ జారీచేసిన రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్ లతో భద్రాద్రి కొత్తగూడెం,జనగాం,కామారెడ్డి,కరీంనగర్,ఖమ్మం,మహబూబాబాద్,ములుగు, పెద్దపల్లి,సిద్దిపేట,వరంగల్,హన్మకొండ జిల్లాల కలెక్టర్లు,ఉన్నతాధికారులతో మంగళవారం నాడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ముప్పు పై హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడ అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏ విధమైన నష్టం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
రేవెన్యూ,పోలీస్,నీటిపారుదల,పంచాయతీరాజ్,విద్యుత్తు,ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో వ్యవహరించి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాణ,ఆస్థి నష్టం జరగకుండా అన్ని నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.భారీ వర్షాల నేపధ్యంలో రోడ్లు,కాజ్ వేలు,నీటి పారుదల ట్యాంకులు కూడా మునిగి పోయే ప్రమాదం ఉందని ఆమె అధికారులకు తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు నిత్యం ఎలర్ట్ గా ఉండాలని,ఎక్కడైనా ప్రమాదకర ట్యాంకులు తెగిపోతే అడ్డుకోవడానికి ఇసుక బస్తాలు సిద్దంగా ఉంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
Skin Allergy : ఈ టిప్స్ ఫాలో అయితే స్కిన్ అలర్జీ ఈజీగా తగ్గుతుంది..!
విపత్తు నిర్వహణ కార్యదర్శి రాహుల్ బొజ్జా(Rahul Bojja) ఇదే సమావేశంలో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు,శిధిలమైన కాజ్ వే లు,వంతెనలను ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు.అదేవిధంగా అగ్నిమాపక శాఖ(Fire Department) ఇప్పటికే అన్ని జిల్లాలలోని కార్యాలయాలలో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసినట్లు,డిపార్ట్ మెంట్ కూడా అప్రమత్తంగా ఉందని,ఆత్యయిక పరిస్థితులలో జిల్లాలకు సహాయం అందించేందుకు సిద్దంగా ఉందని ఆయన తెలిపారు.