Skin Allergy : ఈ టిప్స్‌ ఫాలో అయితే స్కిన్‌‌‌ అలర్జీ ఈజీగా తగ్గుతుంది..!

Telugu Mirror : వర్షాకాలం మొదలయింది. పలుచోట్ల వానలు పడుతుండడంతో వేడి నుండి కొంత ఉపశమనం కలిగింది .వర్షంలో తడవడం అంటే చాలామందికి ఇష్టం. కానీ వర్షం లో తడిసిన తర్వాత పలు రకాల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. వర్షంలో తడవడం వల్ల చర్మం పై ద్దదుర్లు, దురదలు రావడం సహజం. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఎలా బయటపడాలో తెలుసుకుందాం.

వర్షంలో తడిసినప్పుడు మీ స్కిన్ దురదగా ఉంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వలన దురద బారినుండి బయటపడవచ్చు. ఈ చిట్కాల కోసం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. అలాగే డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితో కొన్ని హోమ్ రెమెడీస్ చేసుకుని ఉపయోగించడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.

Zinc : శరీరానికి జింక్ వల్ల ఉపయోగాలు ఇవే..

వంట సోడా మరియు నిమ్మకాయ:

వానాకాలంలో తడవడం వలన వచ్చే దురద నుండి బయటపడడానికి స్నానం చేసే ముందు ఒక బౌల్ లో రెండు చెంచాల బేకింగ్ సోడా మరియు ఒక చెంచా నిమ్మరసం వేసి ముద్దలా తయారు చేయాలి. ఈ పేస్ట్ ని చర్మం పై రాసి పది నిమిషాలు పాటు అలాగే ఉంచాలి. తర్వాత స్నానం చేయాలి. ఈ విధంగా రోజుకి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల దురద తగ్గే అవకాశం ఉంది.

గంధం పేస్ట్:

గంధం పేస్ట్ ని చర్మంపై రాయడం వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గంధపు పొడిలో, రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని దురద ఉన్నచోట పూయడం వలన దురద తగ్గే అవకాశం ఉంది.

వేప ఆకులు:

చర్మ సంబంధిత అన్ని ఇబ్బందులకు వేప ఒక చక్కటి పరిష్కార మార్గం. వేప వల్ల చర్మానికి చాలా మేలులు ఉన్నాయి. వేపలో ఉండే ఔషధ గుణాల వలన ఎలర్జీ సమస్యలను దూరం చేస్తాయి. వేపాకులను మెత్తగా పేస్టులాగా నూరి దురద ఉన్నచోట పై పూతగా రాయడం వలన దురద సమస్యకు చెక్ పెట్టవచ్చు.

SVS : స్మార్ట్ ఫోన్ తో కళ్లకు కష్టకాలం.. స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ అసలు కారణమా?

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో వ్యాధికారక క్రిములను నాశనం చేసే లక్షణాలు ఉండటం వలన చర్మంపై దురద వచ్చినప్పుడు కొబ్బరి నూనెను చర్మానికి రాయడం వలన దురద తగ్గే అవకాశం ఉంది.ఇటువంటి కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వలన వర్షంలో తడిసినప్పుడు వచ్చే దురదను తొలగించుకోవచ్చు.

గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించివ్రాయబడినది .పాఠకులకు జ్ఞానము మరియు అవగాహన పెంచడానికి సంబంధిత కథనం తయారు చేయబడింది. పై కథనంలో పేర్కొన్న సమాచారాన్ని ప్రయత్నించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

Leave A Reply

Your email address will not be published.