Telugu Mirror: వర్షాకాలం కొనసాగుతోంది .వానలు పడే రోజులు కాబట్టి వాతావరణం తేమతో కూడి ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో అనేక రకాల బ్యాక్టీరియా(bacteria)మరియు వైరస్(virus)లు అధికం అవడానికి వీలు ఉండే కాలం. అందువలన ఈ సీజన్ అంటు వ్యాధులు ఎక్కువగా వస్తాయి మరియు ఇవి గణనీయంగా పెరుగుతున్నాయి కూడా. అంటువ్యాధులను నివారించాలంటే ఆహారం మరియు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తి అనేది శరీరానికి నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. దీనికోసం మనం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే .అంటువ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చని నీటిని త్రాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి సులువుగా బయటపడాలంటే మనం ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తప్పకుండా త్రాగాలి.
గోరువెచ్చని నీరు తీసుకోవడం వల్ల అంటు వ్యాధులు రాకుండా చాలా బాగా పనిచేస్తాయి. అయితే ఈ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. వర్షాకాలంలో ఫ్లూ(Flu) మరియు ఇన్ఫెక్షన్ చాలా సాధారణంగా ఉండే విషయం. ఇటువంటి సమయంలో హాట్ వాటర్ తాగడం ద్వారా శ్వాస కోస ఇబ్బందులను తొలగించుకోవచ్చు .సాధారణంగా వచ్చే జలుబు మరియు దగ్గు ఈ హాట్ వాటర్(Hot Water) తాగడం వల్ల చాలా బాగా సహాయపడతాయి. అలాగే బరువు తగ్గడానికి కూడా ఇవి బాగా సహాయపడతాయి.
క్రమం తప్పకుండా గోరువెచ్చని నీరు త్రాగడం వలన చర్మ మరియు జీర్ణ క్రియ కు సంబంధించిన ఇబ్బందులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని అధ్యయనంలో పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్స్(Infections)వల్ల ముక్కు శ్వాస తీసుకోవడానికి వీలులేకుండా మూసుకు పోతుంది. దీనికోసం గోరువెచ్చని నీటిని తీసుకుంటూ మరియు వేడి నీటితో ఆవిరి పట్టడం వల్ల ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం పొందవచ్చు.
Also Read:Sugar Patients: మధుమేహ బాధితులు పండ్లు తిన్నా ప్రమాదమే..ఈ పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా ?
2008 అధ్యయనాల ప్రకారం జలుబు, గొంతు నొప్పి, దగ్గు మరియు అలసటగా ఉన్నప్పుడు వేడి పానీయాలు(Hot Water) తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు అని అంటున్నారు. వర్షాకాలంలో జీర్ణ క్రియ కు సంబంధించిన ఇబ్బందుల నుండి బయటపడటానికి మరియు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి గోరువెచ్చని నీళ్లు చాలా బాగా పనిచేస్తాయి. శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటికి పంపడంలో చాలా బాగా పనిచేస్తాయి. వేడి నీరు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మరియు కడుపులో ఉండే ఇతర సమస్యలను కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుంది .
కాబట్టి ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి బయటపడడానికి మరియు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ప్రతి ఒక్కరు గోరువెచ్చని నీటిని ప్రతిరోజు తీసుకోవాలి.