హీరోయిన్ గౌతమి 90లో స్టార్ హీరోయిన్ (Star Heroin) గా ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈమెకు తాజాగా ఒక సమస్య (Problem) వచ్చింది. తన విలువైన కోట్ల ఆస్తిని ఒక దుర్మార్గుడు అక్రమంగా లాక్కున్నాడు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ (Police station) కి వెళ్లాల్సి వచ్చింది. ఆ దుర్మార్గుడు నుంచి తనకు ప్రాణ హాని కూడా ఉంది అని చెప్పి ఎమోషనల్ అయ్యారు. వాడిని ఎలాగైనా శిక్షించాలని, నా 25 కోట్ల ఆస్తిని నాకు ఇప్పించమని పోలీసులను వేడుకుంటున్నారు. అయితే స్టార్ ఇమేజ్ మరియు సెలబ్రిటీ (Celebrity) అయిన ఈమెకు ఇలాంటి పరిస్థితి ఎలా ఎదురయింది అని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళదాం.
Also Read : అతిలోక సుందరి కి అరుదైన బహుమతి ఇచ్చిన గూగుల్.. నేడు అందాలనటి శ్రీదేవి జయంతి.
రాజకీయాల్లోకి సమంత ఎంట్రీ ఇవ్వనుందా ,ఆ పార్టీ తరపున ప్రచారం చేయనుందా?
అప్పట్లో అనగా తొంభయవ దశకాలలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హోదా తెచ్చుకున్నారు గౌతమి. సినిమాలు చేసి బాగా సంపాదించి ఆస్తులు కూడా పెట్టారు. చెన్నై (Madras) చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువ చేసే స్థిరాస్తులు కూడా సంపాదించారు. అయితే ఆమెకున్న స్థిర ఆస్తిలో నుంచి తన కూతురి చదువు (Study) కోసం మరియు తన ఆరోగ్య (Health) ఖర్చు నిమిత్తం, కొంత భాగాన్ని అమ్మాలి అనుకున్నారు.
సుమారుగా 25 కోట్ల రూపాయల విలువైన ఆ స్థలాన్ని అమ్మి పెట్టమని అలగప్పన్ అని ఏజెంట్ కు అప్పచెప్పారు. ఇక అలగప్పన్ దొరికిన ఈ లక్కీ ఛాన్స్ కి చాలా సంతోషపడ్డాడు. గౌతమి సంతకాన్ని ఫోర్జరీ (Forgery) చేసి, తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఇక ఆ ల్యాండ్ (Land) ని కొట్టేశాడు. తర్వాత నుండి గౌతమి కి ఫోన్( Phone) చేసి ఆ ల్యాండ్ తనదే అని బెదిరిస్తున్నాడు. గౌతమి గట్టిగా నిలదీసి అడిగినందుకు చంపేస్తా అంటూ బెదిరిస్తున్నాడు. దీనితో అతడి మాటలను, బెదిరింపులను సీరియస్ గా తీసుకున్న గౌతమి చెన్నై పోలీస్ స్టేషన్లో అలగప్పన్ పై ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయమని వారి దగ్గర ఎమోషనల్ అయ్యారు.
దీంతో ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ (Hot topic ) గా మారింది. ఈ సంఘటనతో నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతున్నారు గౌతమి.