Telugu Mirror: హిందూ మతాచారాల ప్రకారం శ్రావణ మాసాన్ని వ్రతాలు,పండుగల మాసంగా భావిస్తారు. శ్రావణ మాసం (sravana masam) లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. శ్రావణి సోమవారం, మంగళవారం, బుధవారం -గురువారం పూజ తర్వాత శ్రావణి శుక్రవారం వస్తుంది. శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో శుక్లపక్షం చివరి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇంతకు ముందు ఈ ఉపవాసం చేసిన వారి మార్గద్శకత్వంలో ఈ ఉపవాసం చేయండి. ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించనున్నారు.
వరలక్ష్మీ వ్రత పూజా ఆచారం
శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని అమితంగా పూజిస్తారు. మొదట, వేకువనే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శుద్ధి చేసి సౌభాగ్య అలంకారం ధరించి పూజకు సిద్ధపడాలి. పసుపు,కుంకుమ, గంధం వీటితో కలిపిన మిశ్రమం తో స్వస్తిక్ గుర్తును అమర్చి దానిపై కలశం ఉంచి.అమ్మవారిని అలంకరించి, వరలక్ష్మిని ఆవాహన చేయండి. శ్రీసూక్తముతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి ఇరవై ఒక్క అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. పూజకు వచ్చిన స్త్రీలకు వాయనం ఇవ్వాలి. పూజ అనంతరం వరలక్ష్మి అమ్మవారి కథను చదవండి లేదా శ్రవణం చేయండి. ఈ రోజున రోజంతా ఉపవాసం ఉండాలని చెబుతారు. గృహానికి ఈశాన్య దిక్కులో మండపాన్ని ఉంచి, నలువైపులా కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ కలశం పై వరలక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేయండి. శ్రీసూక్తముతో అమ్మవారిని పూజించాలి అమ్మవారికి ఇరవై ఒక్క అప్పాలు నైవేద్యంగా సమర్పించి పూజకు వచ్చిన స్త్రీలు, బ్రాహ్మణులకు రకరకాలుగా ఇవ్వాలి. అనంతరం దేవత కథ వినండి.
ప్రాముఖ్యత మరియు గుర్తింపు
వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా రోగాల నుండి బయటపడటానికి చేస్తారు అంటే దీర్ఘాయుష్షు కోసం. అయితే ప్రస్తుత కాలంలో కేవలం సుస్తీ నుంచి విముక్తి కోసం మాత్రమే ఇలాంటి ఉపవాసం పాటించడం లేదు. అయితే సంప్రదాయంగా వస్తున్న వ్రతాన్ని వదిలివేయకుండా ఉండేందుకు ఇప్పటికీ చాలా మంది మహిళలు విశ్వాసంతో కులాచారంగా ఈ వ్రతాన్ని పాటిస్తున్నారు. ఈ వ్రతంలో చాలా మంది అమ్మవారి ప్రతిరూపాన్ని తయారు చేస్తారు. అమ్మవారిని అందమైన చీరలో అలంకరించి. ఆభరణాలు, కంఠాభరణాలు, పట్టీలు, నాథాలు తదితరమైనవి అలంకారానికి ఉపయోగిస్తారు. విఘ్నేశ్వరుని మరియు లక్ష్మిని పూజించడం ద్వారా మనకు వరద అంటే అనుగ్రహం లభిస్తుంది. అందుకే దీనిని వరలక్ష్మీ వ్రతం అంటారు. దేవాదికులు, ఋషిమునిలు ఆమెను ‘శ్రీ వర్దలక్ష్మి’ అని కీర్తించారు. శ్రీ వరలక్ష్మి ఐశ్వర్య దేవత. వరలక్ష్మిని భావయుక్తంగా పూజించే వారి ఇంట ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సంతాన యోగం కలిగి అదృష్టవంతులు అవుతారని శ్రీ వరలక్ష్మీ దేవి వాగ్దానం.
గమనిక: ఈ భక్తి సమాచారం,పరిహారాలు మతాచార విశ్వాసాలపై ఎవరికి వారి నమ్మకం పై ఆధార పడి ఉన్నవి. తెలుగు మిర్రర్ సేకరించిన మరియు ఊహల ఆధారంగా కథనం తయారు చేయబడినది. దీనికి సంబంధించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.