Today Horoscope 25 August 2023: ఈ రోజు వృషభ రాశి వారికి మనస్సును సంతృప్తిగా ఉంటుంది, మిగిలిన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్యారాశి, తులారాశి, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం మరియు మీన

రాశుల వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries):

ఈ రోజు నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. ప్రస్తుతం మీకు పరీక్షా సమయం నడుస్తుంది. మీరు చేసే పనిలో మరింత శ్రద్ధ వహించాలి, అప్పుడే మీరు చేసే పనిలో మీకు విజయం లభిస్తుంది. గతంలోని పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు.

ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు.

వృషభం (Taurus):

ఈరోజు మీరు ఒకదాని వెంట మరొకటి వింటారు, ఇది మీ మనస్సును సంతృప్తి పరుస్తుంది అది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. భాగస్వామి కోసం సమయం కేటాయించండి లేకుంటే వారి ఆగ్రహానికి గురి కావలసి రావచ్చు. ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండండి లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చూడవచ్చు.

మిథునం (Gemini):

ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమాచారం అందుకుంటారు.  విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టండి అపుడే విజయం సాధిస్తారు. ఈ రోజు పిల్లల నుంచి శుభవార్త వింటారు. అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో నూతన సాంకేతికతను ఉపయోగిస్తారు. ఈ రోజ మీ జీవిత భాగస్వామి మీకు పూర్తి మద్దతుగా నిలుస్తారు

కర్కాటకం (Cancer):

ఈరోజు మీ పరిస్థితి మామూలుగా సాగిపోతుంది. గతంలో ఉన్న సమస్యలు ఈరోజు కొంత వరకు పెరిగే అవకాశం ఉంది, ఇది మిమ్మల్ని కొంచెం ఆందోళనకు గురి చేస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు పని ప్రదేశంలో పని ఒత్తిడి పెరగవచ్చు, మీరు కొంచెం ఆందోళన చెందుతారు, మీ భాగస్వామి మద్దతుతో మీరు దానిని పూర్తి చేయగలుగుతారు.

సింహం (Leo):

ఈరోజు మీకు వ్యాపారం గురించి ఆలోచన వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ముందుకు సాగండి. ఈరోజు మీ కుటుంబంలోని ఎవరి పైన ఐనా మీకు ఫిర్యాదులు ఉంటే, వాటిని తీసివేయండి. స్నేహితులతో కలిసి ఉండటం వల్ల ఈరోజు మీకు కొంత మేలు కలుగుతుంది.

కన్య (Virgo):

ఈ రోజు మీరు మీపని, ఇతరుల పని చేయవలసి వస్తుంది.మీ పని వాయిదా పడుతుంది. ఈ రోజు మీ మనస్సు,హృదయం రెండిటి మాట విని వ్యాపార నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే నష్టం కలుగుతుంది. మీరు సహాయం చేస్తే తిరిగి మీకు అది లభిస్తుంది. కుటుంబం లోని పాత సమస్యలు తొలగిపోతాయి.

తుల (Libra):

Image credit: pothunalam.com

ఈరోజు కుటుంబ వ్యాపారం కొంత నష్టం కలిగించే అవకాశం కనిపిస్తోంది. మిమ్మల్ని ఇతరులు ఉపయోగించుకుంటారు. మీ బంధువులనుండి శుభవార్త వింటారు. అది మీకు సంతోషం కలిగిస్తుంది. స్వంత ఖర్చులు కలిగి ఉంటారు. మీ కొలీగ్స్ తో కలసి పనిచేయడం ఆనందాన్ని కలిగిస్తుంది. జీతం పెరిగే శుభవార్త వింటారు.

వృశ్చిక (Scorpio):

ఈ రోజు సాయంత్రం వరకు వ్యాపార ఒప్పందాలలో లాభం పొందుతారు. ఈ రోజు వ్యాపారంలో కష్టపడితేనే డబ్బు లభిస్తుంది. ఆర్ధిక వృద్ధిని పెంచండి.కుటుంబానికి సంభందించిన నిర్ణయం తీసుకోవలసి వస్తే పెద్దవారిని తప్పకుండా సంప్రదించండి.

ధనుస్సు (Sagittarius):

Image Credit: Astrology Hindi

డబ్బు పెట్టుబడికి ఈ రోజు మంచిది.బంధువుల సహాయంతో పిల్లల వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగి పోతాయి. భాగస్వామితో చికాకులు తొలగిపోతాయి.సహోద్యోగులతో వాగ్వాదం ఉండవచ్చు.మృదువుగా మాట్లాడండి.

మకరం (Capricorn):

Image Credit: Hindustan Times Telugu

ఈరోజు శత్రువులు మిమ్మల్ని అన్ని రంగాలలో ఇబ్బంది పెడతారు. మీరు చేసే ప్రతి పనిలోనూ విఫలం అవుతారు. ఈరోజు ఏ పని చేయాలి,చేయకూడదు అని ఆలోచించండి. పిల్లల ఆరోగ్యంలో కొంత ఇబ్బంది కలుగుతుంది.సాయంత్రం స్నేహితులకు సహాయం చేసే పని వుండవచ్చు

కుంభం (Aquarius):

Image Credit: Astroved

ఈరోజు మీ ఇష్టమైన వారికోసం ఖర్చు చేయవలసి రావచ్చు. ఇష్టం ఉన్నా లేకున్నా ఖర్చు తప్పదు. పిల్లల చదువులో ఆటంకాలు కలగ వచ్చు. కొలీగ్స్ తో కలసి పని చేయడం వలన అన్ని సమస్యలు తొలగుతాయి. తల్లి దండ్రులను దైవదర్శనానికి తీసుకు వెళ్ళే అవకాశం ఉంది.

మీనం (Pisces):

ఈరోజు ప్రతి పనీ కష్టం గా ఉంటుంది. ఈ రోజు గట్టిగా ప్రయత్నం చేస్తే ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది. అది మీకు సంతోషం కలిగిస్తుంది. పక్క వారితో వివాదం ఉంటే పరిష్కరించుకోండి లేకుంటే అది చట్టం వరకు వెళ్లొచ్చు. కుటుంబం లో ఎవరితోనైనా చికాకు ఉంటే ఈరోజు సమసి పోవచ్చు. మామగారి వైపునుండి ఆర్ధిక సహాయం కలగ వచ్చు.

Leave A Reply

Your email address will not be published.