ICC ప్రపంచ కప్ 5 అక్టోబర్, గురువారం 2023 న గత ప్రపంచకప్ లో ఫైనలిస్టులైన ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్‌ల మధ్య ఉత్తేజకరమైన పోటాపోటీ మ్యాచ్ తో గురువారం ప్రారంభమైంది. అలాగే ఈ మెగా ఈవెంట్ నవంబర్ 19 వరకు కొనసాగుతుంది. 2023 ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ లు డిస్నీ+హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతోంది.
క్రికెట్ యొక్క ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని, ప్రపంచకప్ కోసం Jio కాంప్లిమెంటరీ డిస్నీ+హాట్‌స్టార్ మెంబర్షిప్ కి జోడుగా ఆరు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటించింది. jio ప్రకటించిన ప్రణాళికల పరిమితి కాలం 28 రోజుల నుండి పూర్తి సంవత్సరం వరకు అమలులో ఉంటుంది.
ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం జియో యొక్క కొత్త ప్రణాళికలు :
రూ. 328 ప్రీపెయిడ్ ప్లాన్ :
3 నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ చందాతో జోడించిన రూ. 328 ప్రీ పెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో రోజుకు 1.5 GB డేటాను అందిస్తుంది.
రూ. 388 ప్రీపెయిడ్ ప్లాన్ :
రూ. 388 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2 GB డేటాను అందిస్తుంది మరియు 3 నెలల కాంప్లిమెంటరీ Disney + Hotstar సబ్‌స్క్రిప్షన్‌తో లింక్ చేయబడుతుంది.
రూ. 758 ప్రీపెయిడ్ ప్లాన్ :
రూ. 758 ప్రీపెయిడ్ కొత్త ప్లాన్ 3 నెలల కాంప్లిమెంటరీ డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో రోజుకు 1.5 GB డేటాను అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 84 రోజులు గా ఉంటుంది.
రూ. 808 ప్రీపెయిడ్ ప్లాన్ :
కొత్త రూ. 808 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటాను మరియు 3 నెలల పాటు Disney+Hotstar యొక్క పరిపూర్ణమైన మొత్తం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
జియో సంవత్సర కాల ప్రీపెయిడ్ ప్రణాళికలు :
Also Read : రిలయన్స్ నుండి వైర్ లెస్ ఇంటర్నెట్ సర్వీస్ జియోఎయిర్ ఫైబర్ ప్రారంభం
Reliance Jio: త్వరలో జియో నుంచి అద్భుతమైన ఫీచర్స్ తో రెండూ 5G స్మార్ట్ ఫోన్స్ విడుదల
రూ. 598 ప్రీపెయిడ్ ప్లాన్ :
Jio యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2GB డేటాను అందిస్తుంది మరియు సంవత్సరకాలం మొత్తానికి Disney+Hotstar యొక్క కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
రూ. 3,178 ప్రీపెయిడ్ ప్లాన్ :
కొత్త రూ. 3,178 ప్రీపెయిడ్ ప్రణాళిక ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటాను మరియు సంవత్సరం మొత్తం పరిపూర్ణమైన డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
అదేవిధంగా, 3-నెలల డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా డేటా యాడ్ఆన్‌లను స్వీకరించే అవకాశం కూడా జియో కష్టమర్ లకు లభిస్తుంది. రూ. 331 డేటా యాడ్ఆన్ 30 రోజుల చెల్లుబాటుతో 40GB డేటాను అందిస్తుంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…