రిలయన్స్ నుండి వైర్ లెస్ ఇంటర్నెట్ సర్వీస్ జియోఎయిర్ ఫైబర్ ప్రారంభం

రిలయన్స్ జియో నుండి గణేష్ చతుర్ధి నాడు సంస్థ వార్షిక సమావేశంలో నూతన ఇంటర్నెట్ సర్వీస్ ను రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. సీమ్ లెస్ ఇంటర్నెట్ సర్వీస్ jio Air Fiber ను ప్రారంభిస్తున్నారు. 1.5 Gbps వేగాన్ని కలిగి ఉంటుంది కొత్త jio Air Fiber

సెప్టెంబర్ 19 న, రిలయన్స్ జియో వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ అయిన జియో ఎయిర్‌ ఫైబర్‌ను మొదలు పెట్టనున్నారు. 1.5 జీబీపీఎస్ వేగంతో అందించనున్న, ఈ వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ గృహాలు మరియు కార్యాలయాలు రెండింటి కోసం రూపొందించబడింది మరియు అంతరాయం లేని వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆన్‌లైన్ గేమింగ్ మరియు స్ట్రీమింగ్‌ను కూడ అందుబాటులోకి తీసుకురానున్నట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ 2023 వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా జియో ఎయిర్ ఫైబర్ గణేష్ చతుర్థి పండుగను పురస్కరించుకొని లాంఛనంగా ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు.

జియో ఎయిర్‌ ఫైబర్‌తో వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది, ఆగస్ట్‌లో జరిగిన రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశంలో, జియో ఎయిర్ ఫైబర్ గురించిన వార్త వెల్లడైంది. గణేష్ చతుర్థి రోజున, ప్రతి ఒక్కరూ జియో ఎయిర్ ఫైబర్‌ని యాక్సెస్ చేయగలరని కంపెనీ సీఈఓ ముఖేష్ అంబానీ తెలిపారు.

జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏమిటి?

Air Fiber, జియో సంస్ధ నుండి వచ్చిన ఒక కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్విస్, 5G టెక్నాలజీని ఉపయోగించి హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలని అందించనుంది. ప్రస్తుత ఫైబర్-ఆప్టిక్ లింక్‌ల కంటే సరసమైన ధరలలోనే వినియోగదారులకి ఈ సేవ అందుబాటులోకి ఉండనున్నది.

జియో చెప్పినట్లుగా సెటప్ చేయడం కూడా చాలా సులభం. డివైస్ ని ప్లగ్ ఇన్ చేసి ఆన్ చేస్తే చాలు దీంతో వ్యక్తిగత Wi Fi హాట్‌స్పాట్‌లు ఇప్పుడు మీ ఇంట్లోనే అందుబాటులో ఉండనున్నాయి. ఎందుకంటే నిజమైన 5G అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ని ఇస్తుంది, కస్టమర్లు వారి నివాస గృహం లేదా కార్యాలయాన్ని జియో ఎయిర్‌ఫైబర్‌తో గిగాబైట్ ఇంటర్నెట్ స్పీడ్‌కి కనెక్ట్ చేయడం వలన కొత్త అనుభూతిని పొందుతారు.”

జియో ఫైబర్ మరియు ఎయిర్ ఫైబర్ మధ్య తేడా ఏమిటి?

Launch of wireless internet service JioAir Fiber from Reliance
image credit : Mango news Telugu

జియో ఫైబర్ అనేది వైర్డు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌పై ఆధారపడిఉంటుంది, జియో ఎయిర్ ఫైబర్ పూర్తిగా వైర్‌లెస్‌గా ఉంటుంది. Jio Fiber లో వచ్చే కేబుల్ సమస్యలు Jio Air Fiber లో ఉండవు.
Jio ఫైబర్ 1Gbps వేగంతో వెళ్లగలదు. రిలయన్స్ ప్రకారం జియో ఎయిర్ ఫైబర్ యొక్క అత్యధిక వేగం 1.5 Gbps వరుకు ఉంటుంది.

జియో ఫైబర్ విస్తృతంగా అందుబాటులో లేని చోట కూడ రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ లభ్యతను విస్తరించాలనుకుంటోంది.

Also Read : BSNL కేవలం రూ 87కే డైలీ 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా

Reliance Jio : జియో ప్రీ-పెయిడ్ రూ.119 రీఛార్జ్ నిలిపివేత, దానికి బదులుగా కొత్త ప్లాన్ ప్రారంభం.

జియో ఎయిర్ ఫైబర్ ఇన్స్టలేషన్ Jio Fiber కంటే ప్లగ్ అండ్ ప్లే పద్దతిలో చాలా సులభంగా ఉంటుంది. వినియోగదారుడు ప్లగిన్ చేసిన వెంటనే ఇంటర్నెట్ డివైస్ కి కనెక్ట్ అయేలా ఇది సృష్టించబడింది. మరోవైపు, Jio Fiber కి ప్రత్యేక ఇన్‌స్టాలేషన్ అవసరం. ఇంటర్నెట్ యొక్క ప్రయోజనాలు అప్పుడే అందుబాటులో ఉంటాయి.

ఇప్పుడు ధర గురించి మాట్లాడుకుందాం.

జియో ఎయిర్ ఫైబర్ ప్రస్తుతం ఉన్న జియో ఫైబర్ కంటే ఎక్కువ ఖర్చవుతుంది ఎందుకంటే ఇది పోర్టబుల్ డివైజ్‌గా పని చేస్తుంది మరియు పైన పేర్కొన్న ప్రయోజనాలను అందిస్తుంది. భారతదేశంలో, జియో ఎయిర్ ఫైబర్ ధర రూ. 6,000 కావచ్చు.

Comments are closed.