Telugu Mirror: సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) సినిమాలలోనే కాదు బయట కూడా హీరోగానే ఉంటాడు. అభిమానులు ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకునే మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని ఇండస్ట్రీలోనూ, బయటా ముందుకు తీసుకువెళుతూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించాడు. తన వంతు సామాజిక భాద్యతగా మహేష్ బాబు తన పేరున ఉన్న ఎంబీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అన్నిటి కంటే ముఖ్యంగా ఎంతోమంది గుండె జబ్బులు ఉన్న చిన్నపిల్లలకు ఆపరేషన్ లు చేపించడం ద్వారా వారి ప్రాణాలకు ఊపిరి పోస్తున్నాడు.
సినిమాలు,సేవా కార్యక్రమాల తోపాటు కుటుంబంతో సమయం గడపడానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే మహేష్ బాబు కి ఇద్దరు పిల్లలు ఉన్నారు బాబు గౌతమ్ ఘట్టమనేని (Gowtham Ghattamaneni), పాప సితార. అయితే సితార పాప చేసే అల్లరి గౌతమ్ బాబు చేయడు సామాజిక మాధ్యమాలలో సితార పాప అల్లరి ఎక్కువగా కనిపిస్తుంది. గౌతమ్ ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించడు. ఎప్పుడూ తనపని తాను చేసుకుంటూ సైలెంట్ గా ఉంటాడు గౌతమ్ బాబు.
అప్పుడప్పుడూ తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంబీ మాల్ లో సందడి చేస్తూ కనిపిస్తుంటాడు. అయితే అలా సైలెంట్ గా ఉండే గౌతమ్ తాజాగా చేసిన ఓ మంచిపని అభిమానులను ఫిదా చేస్తుంది. తండ్రికి తగ్గ తనయుడిగా గౌతమ్ కూడా తన మంచి మనసును చాటుకున్నాడు.
మహేష్ బాబు చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎంబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర హాస్పిటల్ మరియు రెయిన్ బో ఆసుపత్రి తో కలసి వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫౌండేషన్ కు సంభందించిన పనులన్నీ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ చూసుకుంటారు. అయితే తాజాగా ఈసారి ఫౌండేషన్ పనులను గౌతమ్ ఘట్టమనేని చూసుకున్నట్లు తెలుస్తుంది.
తాజాగా గౌతమ్, మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలలో అక్కడ ఉన్న చిన్నపిల్లలతో కలసి ముచ్చటిస్తూ గడిపాడు. తన కొడుకు ఫౌండేషన్ పనులలో ముందుండి నడపడం, అక్కడ ఉన్న వారిని పలుకరిస్తూ, అందరితో ప్రేమగా మాట్లాడటం చూసి మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గర్వ పడుతుంది. నా కుమారుడిని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉందంటూ ఆమె ఎమోషనల్ అయింది.
రెయిన్ బో హాస్పిటల్ (Rainbow Hospital) కు గౌతమ్ తరచుగా వస్తుంటాడు. ఎంబీ ఫౌండేషన్ తో కలసి రెయిన్ బో ఆసుపత్రి చిన్న పిల్లలకి ఉచిత వైద్యం అందిస్తున్న విషయం విదితమే. గౌతమ్ కూడా ఈ కార్యక్రమాలలో భాగస్వామి, కాకపోతే ఈసారి తనే పర్యవేక్షించాడు. ఆంకాలజీ,కార్డియో వార్డ్ లలో ఉన్న పిల్లలతో కలసి ముచ్చటిస్తూ, వారి ముఖాలలో నవ్వులను తీసుకువస్తూ, వారికి నయం అవుతుందంటూ భరోసాను కల్పించాడు అని ఎంబీ ఫౌండేషన్ చేసిన పోస్ట్ ను నమ్రత శిరోద్కర్ షేర్ చేస్తూ తన కొడుకును చూసి మురిసిపోయింది.
Also Read: Mega Prince: ప్రిన్స్ పెళ్లి కి మెగా ఫ్యామిలీ భారీ ఏర్పాట్లు, రహస్య ప్రదేశం లో ఒకటి కానున్న తారలు.
View this post on Instagram
నమ్రత పోస్ట్ చూసిన వారంతా గౌతమ్ ఘట్టమనేని మనసును మెచ్చుకుంటున్నారు. తండ్రి మహేష్ బాబు లాగే గౌతమ్ ది కూడా మంచి మనసని, అందరి మొహాల్లో నవ్వులు చూడాలని తపన పడుతున్నాడు అని మహేష్ బాబు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గౌతమ్ ది గోల్డెన్ హార్ట్ అంటూ ప్రశంసిస్తున్నారు ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు. ఏదేమైనా గౌతమ్ ఘట్టమనేని లిటిల్ ప్రిన్స్ అని నిరూపిస్తూ అందరి హృదయాలను దోచుకున్నాడు.