Telugu Mirror: ప్రతి ఒక్కరూ రుచికరమైన ఆహారం తినాలని కోరుకుంటారు. దానిలో భాగంగా రకరకాల ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చుకుని తింటారు. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందుతుంది.
ఉదాహరణకు నెయ్యి(ghee)ని ఆహారంలో జత చేసి తినడం వల్ల రుచితో పాటు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అటువంటి సందర్భంలో చాలామంది తమ ఇంటిలో నెయ్యిని వారే స్వయంగా తయారు చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్(busy life)లో అందరికీ అది సాధ్యం కాదు. అలాంటివారు మార్కెట్లో లభించే నెయ్యిని కొంటారు. ఆ నెయ్యి స్వచ్ఛమైనదా, కాదా అనే విషయం తెలియదు.
కొంతమంది స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పి కల్తీ నెయ్యిని అమ్ముతుంటారు. ఇటువంటి నెయ్యిని మనం తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఇవాళ మేము మార్కెట్లో కొన్న నెయ్యి స్వచ్ఛమైనదా, కల్తీ ఉన్నదా అనే విషయం ఎలా గుర్తించాలో తెలియజేస్తున్నాం. మీరు కొన్ని పద్ధతులు పాటించి కల్తీ నెయ్యిని కనిపెట్టవచ్చు. కాబట్టి ఆ పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం.
Tips for glowing Skin : నాచురల్ చిట్కాలతో సహజసిద్ధముగా మెరిసే చర్మం మీ సొంతం..
నెయ్యిలో వీటిని కలపడం వల్ల నెయ్యి కల్తీ అవుతుంది. అవి ఏమనగా,
1.నాణ్యతలేనినూనె
2.కూరగాయల నూనె
3.కరిగిన వెన్న
4. డాల్డా
5.హైడ్రోజనేటెడ్ ఆయిల్(hydrogenerated oil) మొదలైన వాటిని నెయ్యిలో కలిపి స్వచ్ఛమైన నెయ్యి పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు.
ఈ విధమైన పద్ధతుల ద్వారా నెయ్యి స్వచ్ఛమైనదా లేదా అనే విషయం గుర్తించాలి.
1. పద్ధతి:
నెయ్యిలో కల్తీ జరిగిందో లేదో తెలియాలంటే దీనికోసం ఉప్పు అవసరం. మీరు చేయవలసిన పని ముందుగా ఒక గిన్నెలో రెండు స్పూన్ల నెయ్యి(two spoons ghee) వేయాలి.
2. పద్ధతి:
తర్వాత అర టీ స్పూన్ ఉప్పు(salt)మరియు ఒకటి లేదా రెండు చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్(hydro chloric acid) వేసి కలపాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి ఒక మిశ్రమంలా చేయాలి .ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలు పాటు అలాగే వదిలేయాలి.
3. పద్ధతి:
20 నిమిషాల తర్వాత తయారు చేసిన మిశ్రమం యొక్క రంగు మారినట్లైతే ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని అర్థం చేసుకోవాలి.
అటువంటి సందర్భంలో మీరు దానిని ఆహారంలో చేర్చుకోవద్దు. ఎందుకనగా ఇది మీ శరీరానికి హాని కలిగేలా చేస్తుంది.
కాబట్టి మీరు కొన్న నెయ్యిని ఇంట్లోనే పరీక్షించి ఆ నెయ్యి స్వచ్ఛమైనదా, కాదా అనే విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే మీ ఆరోగ్యం యొక్క భద్రత మీ చేతుల్లోనే ఉంది.