Telugu Mirror: మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే రోజువారి ఆహారంలో అనేక రకాల విటమిన్లు మరియు పోషకాలు ఉన్న ఆహారం అవసరం. వీటిని మనం ఆహారం ద్వారా సులభంగా పొందవచ్చు. ప్రతి ఒక్కరు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యపరమైన సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మెగ్నీషియం(magnesium)కూడా సహాయపడుతుంది. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారంలో మెగ్నీషియంను తప్పకుండా చేర్చుకోవాలి.
మెగ్నీషియం లోపం ఉంటే వివిధ రకాల వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని పరిశోధనలో కనుగొన్నారు. ఇది గుండె ఆరోగ్యానికి, చెక్కెర స్థాయిని తగ్గించడంలో మరియు మానసిక ఆరోగ్యమును మెరుగుపరచడంలో మంచి ఉపయోగాలను శరీరానికి అందిస్తుంది.
మెగ్నీషియం గింజలు(magnesium seeds), బీన్స్(beans), ఆకుకూర(leafy vegetable)ల్లో ఎక్కువగా ఉంటుంది. ఆహారం ద్వారా మెగ్నీషియం నా అధికంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు .పెద్దవారి యొక్క శరీరంలో 25 గ్రాములు మెగ్నీషియంను కలిగి ఉంటారు .వీటిలో 50 నుంచి 60 శాతం వరకు ఎముకలలో నిల్వ ఉంటుంది. మిగిలినవి కణజాలాలు, కండరాలు మరియు ద్రవాలలో ఉంటాయి. మెగ్నీషియం లోపం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి ఏమనగా బోలుఎముకల వ్యాధి, మానసిక ఆరోగ్య సమస్యలు, జీర్ణ సమస్యలు మరియు నరాల కు సంబంధించిన సమస్యలు తోపాటు రక్తంలో గ్లూకోజ్(Glucose)అభివృద్ధి వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
Also Read:Curd Benefits: పెరుగు వల్ల ఉపయోగాలు తెలిస్తే ఇక అది తినకుండా ఉండలేరు.
విటమిన్- డి, కాల్షియంతో పాటు ఎముకలకు మెగ్నీషియం కూడా అవసరం. మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని పరిశోధనలో పేర్కొన్నారు. మెగ్నీషియం(magnesium)అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎముకలు సాంద్రత నిర్వహించడంలోనూ మరియు రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో బోలుఎముకల వ్యాధి రాకుండా చేయడంలో ఉపయోగకరంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఇది క్యాల్షియం మరియు విటమిన్ డి(vitamin d) పరిమాణాన్ని అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది.
టైప్-2 డయాబెటిస్ సమస్యను తగ్గించడానికి మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల టైప్ టు మధుమేహాన్ని నియంత్రిస్తుంది. అప్పుడు జీవక్రియలో ఇన్సులిన్ మంచిగా పని చేస్తుందని పరిశోధనలు కనుగొన్నారు.
వరల్డ్ జర్నల్ ఆఫ్ డయాబెటిస్ లో ప్రచురితమైన 2015 సమీక్ష నివేదిక ప్రకారం ,మెగ్నీషియం లోపం ఉంటే ఇన్సులిన్ కొరత ఏర్పడుతుంది . అందువలన మెగ్నీషియన్ లోపం లేకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మెగ్నీషియం సప్లిమెంట్లను తీసుకోవడం వలన కూడా ఇన్సులిన్ ను మెరుగుపరుస్తుంది అని మరొక అధ్యాయనంలో కనుగొన్నారు.
మగవారికి ప్రతిరోజు 400 నుంచి 420 గ్రాముల మెగ్నీషియం అవసరం. ఆడవారికి 340 నుంచి 360 గ్రాముల మెగ్నీషియం అవసరం.
కాబట్టి ప్రతి ఒక్కరూ తమ రోజువారి ఆహారంలో గింజలు, ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, బీన్స్ మరియు అవకాడో, బంగాళదుంప, అరటిపండు మొదలైన వాటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. ఎందుకంటే వీటిల్లో అధిక మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది.