Curd Benefits: పెరుగు వల్ల ఉపయోగాలు తెలిస్తే ఇక అది తినకుండా ఉండలేరు.

Telugu Mirror: ప్రతిరోజు మన భోజనం లో వివిధ రకాల ఆహార పదార్ధాలను తీసుకుంటాం.కానీ ఒక సంతృప్తికరమైన భోజనం పూర్తి చేయాలి అంటే పెరుగు ను తింటూ ఉంటాం. భోజనం చివరిలో పెరుగు తినడం వల్ల సంతృప్తిగా భోజనం చేసినట్టు భావిస్తారు.పెరుగు , క్రీమ్ మరియు టేస్టీ గా ఉండే డైరీ డిలైట్(Dairy Delight), ఇవి రుచికరమైన వంటకం మాత్రమే కాదు మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.అయితే పెరుగు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.పెరుగు తినడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

Image Credit: American Heart Association

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

పెరుగులో మంచి బాక్టీరియా(bacteria)ఉంటుంది.ఆ బాక్టీరియా మీ ఆరోగ్య విషయం లో ఎంతగానో మేలు చేస్తుంది. జీర్ణ వ్యవస్థ ను మెరుగుపరచడమే కాకుండా ఉబ్బర సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.మీ కడుపును సంతృప్తిపరుస్తుంది.

రోగనిరోధక శక్తిని(immunity power) పెంచుతుంది

పెరుగు లో ఉండే ప్రోబయోటిక్స్ రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం లో కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పెరగడం వల్ల శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటితో పోరాడడానికి ఉపయోగపడుతుంది.

ఎముక(bones)ల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

పెరుగులో కాల్షియం అధికముగా ఉండడం చేత ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.ఎముకల తో వచ్చే వ్యాధులను నివారించడంలో ప్రత్యేకంగా పని చేస్తుంది.

ప్రోటీన్ పవర్‌హౌస్(protein power house)

పెరుగులో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది.ఇది

మీ శరీర కణజాలం మెరుగుపరచడంలో మరియు కణజాలాన్ని శుద్దిచేయడానికి దోహదపడుతుంది.ప్రోటీన్ లు కూడా కడుపు నిండిన భావనను మరియు సంతృప్తిని ఇస్తాయి.

బరువు నియంత్రణను ప్రోత్సహిస్తుంది

పెరుగుని ఆహరంలో భాగం చేసుకోవడం వలన బరువు అదుపులో ఉంటుంది. ప్రోటీన్ లు మరియు ప్రోబయోటిక్స్ అధికంగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలను దూరం చేసి సంపూర్ణత్వాన్ని కలిగిస్తుంది.

పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ ఆహరంలో ఉండే పోషక విలువలను గ్రహించడం లో తోడ్పడతాయి. మీరు తిన్న ఆహరంలోని పోషకాలు ఎక్కువగా వినిగోగించడం లో సాయపడుతుంది.

రక్తపోటు(blood pressure)నియంత్రణ

సాధారంగా పెరుగుని ఆహారంలో చేర్చుకోవడం వలన రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మరియు గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి .

చర్మ ప్రయోజనాలను కలిగి ఉంటుంది

పెరుగులో ఉండే సెల్స్ , లాక్టిక్ ఆసిడ్, జింక్ మొదలగు వాటి వల్ల ముఖం పై వచ్చే మొటిమలను నియంత్రించడం లో దోహద పడుతుంది మరియు చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

లాక్టోస్(Lactose)అసహనాన్ని నిర్వహిస్తుంది

లాక్టోస్ అసహనం ఉన్నవారికి, పెరుగు తినడం వల్ల లాక్టోస్ ను విచ్ఛిన్నం చేసి తొందరగా జీర్ణమవడానికి దోహదపడుతుంది.

ప్రతి రోజు ఆహరం లో పెరుగుని చేర్చుకోవడం తేలికైన విషయం. ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాలంటే పెరుగుని ఆహరం లో చేర్చుకోండి. పెరుగు అలవాటు అయ్యాక పెరుగు తినడం వల్ల వచ్చే ప్రయోజనాలను అనుభూతి చెందండి.

Leave A Reply

Your email address will not be published.