Effect Of New Cloths : నూతన వస్త్రాలను కొన్న వెంటనే ధరిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.

కొత్త బట్టలు కొన్నాక వాటిని ఎప్పుడు వేసుకోవాలా అని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. చాలామంది చేసే పొరపాటు కొత్త బట్టలను వాష్ చేయకుండా వేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడం తప్పని ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ మరియు వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నూతన వస్త్రాలు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు? కొత్త బట్టలు కొనడమన్నా, వేసుకోవడమన్నా అందరికీ ఇష్టమే. అందులోనూ పండగ సమయంలో పెట్టే బంపర్ ఆఫర్లు విని కొనాలని ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఏం కొనాలో అర్థం కాక తర్జన భర్జన పడుతుంటారు. ఆఫర్ల సమయంలో వేరే అకేషన్స్ కు కూడా ముందుగానే కొని దాచి ఉంచుతారు. ఎందుకనగా మళ్లీ ఇటువంటి ఆఫర్ ఉంటుందో, ఉండదో అని.

కొత్త బట్టలు (New clothes) కొన్నాక వాటిని ఎప్పుడు వేసుకోవాలా అని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. కొన్నవి వేసుకునే దాకా ఆగలేక మధ్యలోనే ట్రైల్స్ వేస్తుంటాం. అయితే చాలామంది చేసే పొరపాటు ఇక్కడే. అనగా కొత్త బట్టలను వాష్ చేయకుండా వేసుకుంటూ ఉంటారు. ఇది విన్నాక ఆశ్చర్యంగా అనిపించినా, అవును ఇది నిజం.

అందరూ చేసే పొరపాటు ఇది. కొత్తగా కొన్న బట్టలను ఇంటికి వచ్చిన వెంటనే వేసుకుంటారు. ఈ విధంగా చేయడం తప్పని ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ మరియు వ్యాధులను (diseases) ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా భారతదేశంలో కొత్తబట్టల ను అసలు ఉతకరు. దీనిని చాలామంది ఒక అపచారంగా భావిస్తారు. కానీ ఇలా చేయడం తప్పు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఆన్ లైన్ షాపింగ్ లేదా షాప్ కి వెళ్లి కొన్నవి అయినా ట్రైల్స్ వేసి చూసుకోవడం తప్పనిసరి అయింది. దీంతో అనేక రకాల బట్టలను ట్రైల్స్ వేసుకొని చూస్తారు. చివరికి ఏవో ఒకటి కొని తీసుకెళ్తారు. ఇక్కడే ఒక విషయం గమనించడం లేదు.

Also Read : Ginger Garlic Soup : చలికాలంలో మజానిచ్చే అల్లం వెల్లుల్లి సూప్, హాయినిస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది .

షాపులో ట్రైల్స్ వేసుకొని వదిలేసిన బట్టలను షాపులో వాళ్లు మంచిగా మడత పెట్టి రాక్స్ లో పెడతారు. మళ్ళీ వాటిని ఎవరెవరో ట్రైల్స్ వేసుకొని చూస్తారు. మళ్ళీ వాటిని సర్ది రాక్ లో పెడుతుంటారు. ఇలా ఎంతోమంది ట్రైల్స్ వేసుకొని వదిలేసిన వాటిని ఇంకెవరో కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. ఇటువంటి బట్టలను వేసుకోవడం వల్ల చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

Effect Of New Clothes : Do you wear new clothes immediately after buying them? But this is for you.
Image Credit : Cottonique

మనం వాటిని కొత్త బట్టలే అనుకుంటాం. కానీ రవాణా సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు (Security measures) ఉండవు. అలాగే వాటిని కింద పడేస్తుంటారు. వాటిని భద్రపరిచే స్థలం శుభ్రంగా ఉంటుందో, లేదో కూడా తెలియదు. బట్టలను ప్యాక్ చేసే సమయంలో చాలామంది చేతులు మారి కొత్త బట్టలు తయారు అవుతాయి. కాబట్టి వీటిపై బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులు తప్పకుండా ఉంటాయి.

కనుక కొత్త బట్టలను వేసుకునే ముందు ఒకసారి వాటిని వాష్ చేసుకుని వాడితే మంచిది.

బట్టలు తయారీ సమయంలో వివిధ రసాయనాలను (chemicals) ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా రెడీమేడ్ బట్టలు లభిస్తున్నాయి. బట్టలను కొన్నిసార్లు పాలిష్ చేయడంలో మరియు ప్రింటింగ్ చేయడంలో ఇలా వాటిలో రసాయనాలను ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి కొత్త బట్టలు ఎంత శుభ్రంగా ఉన్నా వాటిని ఒకసారి వాష్ చేసి వాడటం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Skin Problems In Winter : చలికాలంలో వచ్చే చర్మ సమస్యలను ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎదుర్కోండి

ఎప్పుడైనా కొత్త బట్టలు వేసుకున్నప్పుడు చిరాకు (Irritation) మరియు దురద (itching) అనిపిస్తే దానికి కారణం వాటిపై ఉండే బ్యాక్టీరియా. అంతే కాకుండా కొత్త బట్టలు వాష్ చేయకుండా వేసుకుంటే చెమటను మరియు నీటిని త్వరగా పీల్చవు.

గర్భిణీలు మరియు పిల్లలు కొత్త బట్టలు నేరుగా వేసుకోకూడదు. ఎందుకనగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఖచ్చితంగా వాటిని వాష్ చేసుకుని మాత్రమే వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వారికి సౌకర్యంగా కూడా అనిపిస్తుంది.మరియు వ్యాధుల బారిన (Affected by diseases) పడకుండా ఉంటారు‌.

కాబట్టి కొత్త బట్టలను ఉతక కుండా వేసుకోకూడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

Comments are closed.