Telugu Mirror : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమయింది. ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధ్యయనాల ద్వారా తెలిసిన విషయం ఏమనగా స్మార్ట్ ఫోన్ యొక్క స్క్రీన్ తో ఎక్కువ సమయం గడపడంవల్ల కళ్ళకు చాలా హానికరం అని తెలిసింది.మొబైల్ తో యువత ఎక్కువ సమయం గడుపుతున్నారు .
స్క్రీన్ దగ్గర ఎక్కువ టైం గడపడం వలన ఆ కాంతి కిరణాల ప్రభావంకారణంగా “స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోం “( SVS ) వచ్చే అవకాశం ఉందని కంటి వైద్యులు చెబుతున్నారు.ఎక్కువసేపు చీకటిలో స్క్రీన్ చూడటం వలన కంటిచూపు సమస్య గణనీయంగా పెరుగుతుంది. యువత 70 శాతం మంది ఈ ప్రమాదంలో ఉండవచ్చని నేత్ర వైద్యులు అంటున్నారు. ఈ సమస్యకు తగిన భద్రత తీసుకోకపోతే ఇది కంటి చూపు కోల్పోవడానికి దారితీస్తుంది.
Zinc : శరీరానికి జింక్ వల్ల ఉపయోగాలు ఇవే..
SVS యొక్క సమస్య గురించి తెలుసుకుందాం:
యువతలో ఎస్వీఎస్ సమస్య ఎక్కువ అవుతుందని వైద్యులు అంటున్నారు. ఎందుకనగా ఎక్కువ సమయం ఫోన్, లాప్టాప్ చూస్తుండడం, మరి ముఖ్యంగా చీకటిలో ఫోన్ చూడటం వలన ఈ ఎస్ వి ఎస్ సమస్య రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఎస్ వి ఎస్ సమస్య వల్ల 30 సంవత్సరాల స్త్రీ తన కంటిచూపును కోల్పోయింది.సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల కళ్ళలోని కండరాలు అలసిపోయి బలహీన పడతాయి. అలాంటి సందర్భాల్లో కంటి సమస్యలు వస్తాయి. కండరాలు బలహీనంగా మారినప్పుడు కంటిచూపు మందగిస్తుంది.ఎక్కువ సమయం ఫోన్ స్క్రీన్స్ చూస్తున్నప్పుడు వేడిని మరియు బ్లూ కాంతిని విడుదల చేస్తాయి. స్క్రీన్ చూస్తున్నప్పుడు తక్కువగా కనురెప్పలు మూయడం చేస్తాము.
దీనివల్ల కళ్ళలో తేమ ఇంకిపోవడం, మసకబారడం వంటివి జరుగుతుంటాయి. ఇటువంటి సందర్భాలలో కంటి సంబంధిత ఇబ్బందులు వస్తాయి.
ఫోన్ లైట్ నుంచి వెలువడే నీలిరంగు కాంతి కిరణాలు (బ్లూ రేస్ )కంటిలోని రెటీనాను దెబ్బతీస్తాయి. కళ్ళకు ఒత్తిడిని కలిగిస్తుంది.అప్పుడు కళ్ళు దెబ్బ తినే అవకాశం ఉంది. టీవీ,లాప్టాప్,స్మార్ట్ ఫోన్ లు చీకటి గదిలో ఉండి చూడటం వల్ల కంటి సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అనగాకళ్ళు మంటలు, దురదలు ,చూపు తగ్గిపోవడంతో పాటు, నొప్పి మరియు అలసట వంటి సమస్యలు వస్తాయి.
Nothing Phone(2) : భారత్ లోకి భారీ అంచనాల నడుమ నథింగ్ ఫోన్ (2)..
ఎస్విఎస్(SVS) ను ఎలా అడ్డుకోవాలి:
- ఆపకుండా 20 నిమిషాలు స్క్రీన్ చూసినట్లయితే ,20 నిమిషాల తర్వాత కళ్ళకు రెస్ట్ ఇవ్వాలి.
- 20-20-20 విధానాన్ని పాటించండి – ఈ విధానంలో ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ల పాటు స్క్రీన్ ను 20 అడుగుల దూరంలో చూడండి. దీన్నే 20-20-20 టెక్నిక్ అంటారు.
- స్క్రీన్ చూస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
- చీకటిలో స్క్రీన్ చూడడం మానేయాలి.
- మీరు స్క్రీన్ పై ఎక్కువ సమయం గడపాల్సి వస్తే, నేత్ర వైద్యులను సంప్రదించి, “బ్లూ గ్లాస్ ” ను ఉపయోగించాలి.
ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్మార్ట్ ఫోన్ లేదా ,లాప్టాప్ లేదా టీవీ వల్ల వచ్చే ప్రమాదకరమైన కాంతికిరణాల నుండి మన కళ్ళను రక్షించుకోవచ్చు.