Telugu Mirror : ప్రస్తుత రోజుల్లో కాలుష్యం(pollution)ఎలా విపరీతంగా పెరుగుతుందో అదే విధంగా చర్మ సమస్యలు కూడా చాలా వేగంగా అధికమవుతున్నాయి. చిన్న వయసు నుండే చాలా మంది మొటిమలు, మచ్చలు, దురదలు, టాన్ వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అందమైన మరియు నిగారింపు చర్మం పొందడానికి ప్రతి ఒక్కరు అనేక రకాల పద్ధతులు పాటిస్తుంటారు. కొంతమంది పార్లర్ కి వెళ్లి చర్మాన్ని కాంతివంతంగా మార్చుకుంటారు. మరి కొంతమంది ఇంటి చిట్కాలను అనుసరిస్తారు.అటువంటి ప్రొడక్ట్స్(products) లో రోజ్ వాటర్ ఒకటి.
దీనిని ఉపయోగించడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. కానీ చాలామంది మార్కెట్ లో కొన్న రోజ్ వాటర్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మంట వచ్చే అవకాశం ఉంటుంది. రోజ్ వాటర్(Rose water)ను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈరోజు వాటర్ ను ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. రోజ్ వాటర్ తో ఫేస్ ప్యాక్, టోనర్, మేకప్ రిమూవర్ వీటికి బాగా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
Hair Spa: ‘హెయిర్ స్పా’ తో మీ జుట్టు సమస్యలకు గుడ్ బాయ్, బోలెడు ప్రయోజనాలు మీ సొంతం
రోజ్ వాటర్ చర్మానికి చాలా ప్రయోజన కరంగా ఉంటుంది. దీనిని ప్రతి ఒక్కరూ తమ చర్మాన్ని సంరక్షించుకోవడానికి వాడవచ్చు. గులాబీ రేకులను శుభ్రంగా కడిగి మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత వీటిని మెత్తగా రుబ్బాలి. దీనికి మూడు స్పూన్ల తేనె కలపాలి. తర్వాత దీనిని 30 నిమిషాలు పాటు ఫ్రిజ్(friz) లో ఉంచాలి. ఆ తర్వాత వాడాలి.చర్మాన్ని తాజాగా ఉంచాలంటే రోజ్ వాటర్ టోనర్ చాలా బాగా సహాయపడుతుంది. రోజ్ వాటర్ తో ఇంట్లోనే టోనర్ తయారు చేసుకోవచ్చు. రోజ్ వాటర్ టోనర్ ను తయారు చేయడానికి మార్కెట్లో కొన్న రోజ్ వాటర్ మీకు సరిపడితే దానిని వాడవచ్చు లేదా మీరు ఇంట్లోనే తయారు చేసుకుని ఉపయోగించవచ్చు.
ఇందుకోసం మీరు ఒక కప్పు ఫిల్టర్ చేసిన నీరు మరియు రోజ్ వాటర్ ఒక భాగం, విచ్ హాజల్(Witch Hazal) కలపాలి. అంతే మీ టోనర్ సిద్దమైంది. దీనిని స్ప్రే బాటిల్ లో నింపుకొని ముఖంపై స్ప్రే చేసుకోవాలి. టోనర్ ముఖంపై అప్లై చేయడం వల్ల తెరుచుకున్న చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అలాగే పీహెచ్ లెవెల్(PH- Level) బ్యాలెన్స్ అవుతుంది.మేకప్ చేసుకునే ప్రతి ఒక్కరికి మేకప్ రిమూవర్ అవసరం. రోజ్ వాటర్ ఉపయోగించి మేకప్ రిమూవర్ ని తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి రోజ్ వాటర్ లో మూడు చుక్కల ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ కలపాలి. అంతే మేకప్ రిమూవర్ రెడీ. దీనిని ఉపయోగించి మేకప్ ను తొలగించుకోవచ్చు.
కాబట్టి ఇంట్లోనే రోజ్ వాటర్ తో ఫేస్ ప్యాక్, టోనర్, మేకప్ రిమూవర్ తయారు చేసుకొని, ముఖానికి అప్లై చేసి మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.