ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ నెస్ (Fitness) ని ఎప్పుడైనా గమనించారా? ప్రధాని ఫిట్‌నెస్ అతని వయస్సును మించిపోయింది కనుక వయస్సు (Age) అనేది ప్రధాని మోదీ విషయంలో కేవలం ఒక నంబర్ మాత్రమే. సెప్టెంబర్ 17, 2023న ప్రధాని మోడీ 73వ ఏట అడుగుపెట్టారు. కేవలం నేటి యువతకు మాత్రమే కాకుండా 40 ఏళ్ల తర్వాత సోమరిగా మారుతున్న వారందరికి కూడా ప్రధాని మోదీ స్ఫూర్తి గా నిలుస్తున్నారు. ప్రధానిగా దేశ,విదేశాలలో ఎన్నో బాధ్యతల మధ్య ప్రధానమంత్రి ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు? అయితే నరేంద్ర మోడి కొన్నిసార్లు ట్వీట్ల (Tweets) ద్వారా మరియు చాలాసార్లు మీడియా ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలలో అతని ఫిట్ నెస్ రహస్యం దాగి ఉంది.
ఈ 5 విషయాలు ప్రధాని మోదీ ఫిట్‌నెస్ రహస్యం
పంచతత్వ యోగం
పంచతత్వ యోగంతో ప్రధాని మోదీ దినచర్య మొదలవుతుంది. భూమి, నీరు, అగ్ని (Fire), గాలి, ఆకాశం అనే పంచభూతాలకు సంబంధించిన యోగా చేస్తారు. దీనిలో భాగంగా ప్రధాని మోడీ వ్యతిరేక దిశలో నడుస్తూ, బురదలో నడుస్తూ, ఒక రాతిపై తన వీపును ఆనించి పడుకుని, ఐదు అంశాల నుండి పుట్టుకొచ్చిన ఈ యోగాను ప్రదర్శిస్తారు. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ (Blood Circulation) ను మెరుగుపరచడంలో మరియు కండరాల కదలికలను సరిగా నిర్వహించడంలోనూ సహాయపడుతుంది.
Also Read :విట మిన్ లు కలిగిన ఆహారం , సరైన వ్యాయామం బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఆధారం
యోగ నిద్ర వారానికి రెండుసార్లు
ప్రధాని మోడీని ఒక ఇంటర్వ్యూలో మీరు నిద్ర లేమిని ఎలా సమతుల్యం చేస్తారు లేదా బిజీ షెడ్యూల్స్ (Busy Schedules) ఎలా నిర్వహిస్తారు అని అడిగినప్పుడు, ధ్యాన భంగిమలోనే తన శరీరం నిద్రలోకి వెళ్తుందని, అయితే ఈ నిద్ర ఎంత ప్రభావవంతంగా ఉంటుందంటే శరీరం పునరుత్తేజం అవుతుందని దానివలన తను పని చేసే మానసిక సామర్థ్యం (Ability) పెరుగుతుందని పేర్కొన్నారు.
ఆహారంలో మునగ పరాటా
ఫిట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తన ఆహారంలో మునగ పరోటాను తీసుకుంటానని చెప్పారు. మునగ పరాటా తేలికగా ఉండటమే కాకుండా, అనేక ఔషధ గుణాలతో నిండి ఉంటుంది, ఇది అతనికి శక్తిని ఇవ్వడమే కాకుండా వ్యాధుల నుండి కాపాడుతుంది. ఆరోగ్య పరంగా, మునగలో యాంటీఆక్సిడెంట్లు (Antioxidants), ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి తద్వారా వ్యాధులను నివారించడానికి మరియు శరీరంలోని అనేక సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది.
రాత్రి సమయంలో వగహరేలి ఖిచిడీ
ప్రధాని మోదీ రాత్రి సమయంలో గుజరాత్ లో ప్రసిద్ద వంటకం వాఘరేలీ ఖిచిడీని తినడానికి ఇష్టపడతారు. ఈ ఖిచిడీ బియ్యం, పప్పు, పసుపు మరియు ఉప్పుతో తయారు చేయబడుతుంది. రాత్రి పూట డిన్నర్ ఖిచిడీలో ప్రొటీన్లు సమృద్ధిగా మరియు తేలికగా ఉండటం వల్ల శరీరానికి శక్తిని అందించడమే కాకుండా బరువును బ్యాలెన్స్ (Balance) చేయడంలో కూడా సహాయపడుతుంది.
Also Read : ఎముకలు బలంగా ఉండాలంటే, ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చాల్సిందే
వ్యాధులను నివారించే పసుపు
వ్యాధులు రాకుండా ఉండటానికి పసుపును తీసుకుంటాడు. ఒక్కోసారి తన తల్లి పసుపు (Turmeric Powder) తీసుకున్నావా లేదా అని అడిగేదని ప్రధాని మోడీ చెప్పాడు. దాని కారణంగా పసుపును తీసుకోవడం మర్చిపోడు. పసుపులో ఉండే కర్కుమిన్ (Curcumin) భాగం యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
కాబట్టి, మీరు కూడా ప్రధాని మోదీలా ఫిట్‌గా ఉండాలనుకుంటే, మీ జీవితంలో కూడా ఈ నియమాలను పాటించండి.