Telugu Mirror: మీరు క్రెడిట్ కార్డు వినియోగదారులా?అయితే ఈ వార్త మీ కోసమే. ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ క్రెడ్ తాజాగా నూతన సర్వీసులను ఉపయోగం లోకి తీసుకు వచ్చింది. అదిరిపోయే సేవలను వినియోగం లోకి తీసుకు వచ్చింది. క్రెడిట్ కార్డు (Credit Card) వినియోగించే వారికి ఈ సేవల వల్ల లాభం ఉంటుందని భావించవచ్చు. అయితే కొంతమందికే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. అదికూడా కేవలం రూపే (Rupay) క్రెడిట్ కార్డు హోల్డర్ లకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు.
Also Read:Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్ లో SIP విధానం ..రోజుకి రూ.100 పెట్టుబడి తో కోటీ మీ సొంతం
క్రెడ్ సంస్థ తన ప్లాట్‌ఫామ్ ద్వారా రూపే క్రెడిట్ కార్డు UPI సేవలను వాడుకలోకి తీసుకు వచ్చింది. క్రెడ్ యాప్ వినియోగించే వారు ఈ సర్వీసులు పొందటానికి అర్హులు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో కలసికట్టుగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.అయితే ఇప్పుడు ఏ బ్యాంక్‌కు చెందిన రూపే క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నా కూడా క్రెడ్ ద్వారా సర్వీసులు పొందవచ్చు మరియు చెల్లింపులు కూడా చేయొచ్చు. HDFC బ్యాంక్,ICICI బ్యాంక్,Yes బ్యాంక్, Axis బ్యాంక్, బీఓబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డులు వినియోగించేవారు ఈ సర్వీసులను పొందవచ్చు.
క్రెడిట్ కార్డు ఆన్ UPI సర్వీసుల వినియోగంలోకి తీసుకు రావడం తో ఇకమీదట క్రెడ్ సభ్యులు కూడా రూపే క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి చెల్లింపులు చేయొచ్చు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఉపయోగించి వ్యాపారులకు పేమెంట్స్ చేయవచ్చు. UPI తో రూపే క్రెడిట్ కార్డు లింక్ చేసుకొని ఈ సర్వీసులను పొందొచ్చు. ఈ కొత్త సేవల ద్వారా అటు బ్యాంకులకు, ఇటు క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారికి వెసులుబాటు లభిస్తుందని ఆశించవచ్చు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ హోల్డర్లు సులువుగా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసే అవకాశం వస్తుంది. అదేసమయంలో బ్యాంకులకు క్రెడిట్ వాడకం ఇంకా పెరుగుతుంది. దీని వలన రెండు వైపుల ఉన్న వారికి ప్రయోజనం చేకూరుతుందని భావించవచ్చు.
Also Read:Money Savings : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సంపాదన మీ సొంతం అవుతుంది..!
కాగా భారత దేశ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా పేర్కొంటూవస్తున్న భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మాత్రం ఇంతవరకు UPI రూపే క్రెడిట్ కార్డు సేవలను అందుబాటులోకి తీసుకురాలేదు. త్వరలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా ఈ కొత్త సర్వీసులను వినియోగంలోకి తీసుకు రానున్నదని భావిస్తున్నారు. SBI ఈ సేవలను అందుబాటులోకి తీసుకు రావడం వలన ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. అయితే SBI తోపాటు పలు ఇతర బ్యాంకులు ఈ సర్వీసులను వినియోగం లోకి తీసుకురావాల్సి ఉంది.