Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్ లో SIP విధానం ..రోజుకి రూ.100 పెట్టుబడి తో కోటీ మీ సొంతం

Telugu Mirror: గత కాలం కంటే భిన్నంగా ప్రస్తుత రోజులలో ఖర్చులు పెరిగాయి. మారుతున్న జీవన శైలి వలన జీవన ప్రమాణాలు పెరగడం ద్వారా విపరీతమైన ఖర్చులు పెరిగిపోయాయి. కుటుంబ అవసరాల కోసం పొదుపు చేసుకోవడానికి కూడా డబ్బు మిగలని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాబోయే కాలంలో కుటుంబ ఖర్చులు ఇంకా పెరిగే అవకాశం ఉంది, కనుక పొదుపు చేయడం చాలా ముఖ్యం.

Also Read: Business Idea : టెర్రస్ పై బిజినెస్ ఐడియా.. ఇంట్లోనే ఉంటూ అధిక రాబడితో అత్యంత లాభం..

రాబడి మొత్తంలో రోజు కొంత పొదుపు చేసుకుంటూ పోతే స్వల్పకాలంలోనే కోటీశ్వరులుగా మారిపోవచ్చు. అందుకు మార్గం గా మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds)ను ఎంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds)లో SIP విధానం లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా మంచి రిటర్న్స్ లభిస్తాయి. SIP విధానం అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ మెంట్ ప్లాన్. SIP విధానంలో రోజుకి రూ.100 ఆదా చేస్తే.. పెద్ద మొత్తంలో రాబడి తిరిగి లభిస్తుంది. ప్రతిరోజు పొదుపు చేయడం ద్వారా నెల నెలా మ్యూచువల్ ఫండ్స్ లో చిన్న మొత్తం లో పెట్టుబడి పెట్టడం ద్వారా 30 సంవత్సరాల తర్వాత మీరు కోటి రూపాయలకు పైగా ఆదాయం పొందుతారు.

Also Read:Money Savings : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సంపాదన మీ సొంతం అవుతుంది..!

ప్రతిరోజు రూ.100 ఆదా చేయడం ద్వారా మీరు కోటి రూపాయలను ఎలా పొందగలుగుతారో ఇక్కడ తెలుసుకుందాం. మీరు రోజుకి రూ.100 ఆదా చేశారనుకోండి అప్పుడు మీ దగ్గర నెల మొత్తం కలిపి రూ.3,000 అవుతాయి. వీటిని SIP పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈ డబ్బుపై ప్రతి సంవత్సరం 12 శాతం రిటర్న్ వస్తుంది. ఈ మొత్తాన్ని 30 సంవత్సరాలకు లెక్కిస్తే మీకు రూ.1, 05,89,741 అవుతుంది. అంటే 30 సంవత్సరాల సమయానికి మీ చేతిలో కోటి ఆరు లక్షల రూపాయల రాబడి ఉంటుంది.

For small investors sip investment is also a solution

ఇక్కడ మీ ఇన్వెస్ మెంట్ 30 సంవత్సరాలలో కేవలం రూ.10,80,000 మాత్రమే. కానీ ఇది 30 సంవత్సరాలు వచ్చేసరికి రూ.95,09,741 సుమారుగా అవుతుందని అంచనా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మీరు చేసిన ఇన్వెస్ట్ మెంట్ మీద వచ్చే రిటర్న్స్ విషయంలో ఎటువంటి హామీ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ SIP పద్ధతి అనేది రిస్క్ తో కూడుకున్నదని చెప్పవచ్చు. మార్కెట్ లో ఉండే హెచ్చుతగ్గులను బట్టి రాబడి విషయంలో తేడా ఉండవచ్చు.

గమనిక: ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి నిపుణులను సంప్రదించిన తరువాత,అన్ని విషయాలను తెలుసుకుని ఆపై మీ స్వీయ నిర్ణయం మీదనే ఆధారపడి పెట్టుబడి పెట్టండి. ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే.

Leave A Reply

Your email address will not be published.