Business Idea : టెర్రస్ పై బిజినెస్ ఐడియా.. ఇంట్లోనే ఉంటూ అధిక రాబడితో అత్యంత లాభం..

Telugu Mirror : మీరు మీ ఇంటి వద్ద నుండే ఏదైనా వ్యాపారం(Business) చేయాలని అనుకుంటున్నారా అయితే సింపుల్ గా మీరు ఈ వ్యాపార ఆలోచనలను పాటించడం ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించండి. మీరు మీ ఇంటి టెర్రస్(Terros) ను ఉపయోగించుకునే ఈ వ్యాపారాన్ని చేయవచ్చు పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ వ్యాపారం వలన మీకు ప్రతి నెల ఆదాయం లభిస్తుంది. మీ టెర్రస్ ని ఉపయోగించుకోవడం ద్వారా మీరు నెల నెలా ఆదాయాన్ని సృష్టించుకోవచ్చు.

లీకైన Redmi12 5G..గ్లోబల్ లాంఛ్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న Redmi గాడ్జెట్స్

మీరు మీ ఇంటి పై కప్పుమీద మొబైల్ టవర్లు , సోలార్ ప్లాంట్స్ , టెర్రస్ ఫార్మింగ్, హోర్డింగ్ లు బ్యానర్(Banner) ల ద్వారా మీరు మంచి రాబడిని సాధించడానికి మంచి అవకాశం ఉంది.మీరు మీ ఇంటి టెర్రస్ ను ఏదైనా వ్యాపార సంస్థకు అద్దెకు ఇవ్వడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మీకు వచ్చే ఆదాయం మీరు నివసించే ప్రాంతాలను బట్టి ఉంటుంది. పట్టణాలలో మరియు నగరాలలో టెర్రస్ ను అద్దె(Rent)కు ఇవ్వడం ద్వారా మీకు మంచి ఆదాయం సమకూరుతుంది.

టెర్రస్ ఫార్మింగ్ :

టెర్రస్ ఫార్మింగ్ అంటే ఇంటి పైకప్పు మీద వ్యవసాయం చేయడం. మీరు మీ ఇంటి పైన ఖాళీ ప్రదేశంలో టెర్రస్ ఫార్మింగ్ చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. మీ ఇంటి డాబా పైన పాలి బ్యాగులలో కూరగాయలను పండించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. మీకు డాబాపై ఎక్కువ స్థలం కలిగి ఉంటే మీకు ఇంకా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. డ్రిప్ సిస్టం(Drip System) లో మీ మొక్కలకు నీటిని అందించవచ్చు అలాగే మీ టెర్రస్ పైకి సూర్యకాంతి(Sunlight) సరిగా వచ్చేలా చూసుకోవడం ద్వారా మీ మొక్కలను మంచిగా పెంచే అవకాశం ఉంది. టెర్రస్ పై కూరగాయలను పండించి మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

Image Credit : Vote Earth Now

సోలార్ ప్లాంట్ :

మీరు మీ టెర్రస్ పై సోలార్ ప్లాంటును ఏర్పాటు చేయడం ద్వారా కూడా వ్యాపారం చేయవచ్చు. మీరు ఇంటి పై సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం ద్వారా మీ విద్యుత్ బిల్లు(Electric Bill)ను ఆదా చేయవచ్చు. సోలార్ ప్లాంట్ మీకు మంచి ఆర్థిక చేయూతను అందిస్తుంది. సోలార్ ప్లాంట్ ద్వారా వచ్చే విద్యుత్ అమ్మడం ద్వారా మీకు గణనీయమైన ఆదాయం లభిస్తుంది. ఈ విధానాన్ని ప్రభుత్వాలు కూడా బాగా ప్రోత్సహిస్తున్నాయి. కాకుంటే సోలార్ ప్లాంట్(Solar Plant) ఏర్పాటు కోసం ప్రారంభంలో కొంత మొత్తం పెట్టుబడి పెట్టవలసి వస్తుంది.

Today Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈరోజు సోమవారం, జూలై 31, 2023 తిథి ,పంచాంగం

మొబైల్ టవర్ :

మీరు మీ ఇంటి పై స్థలాన్ని మొబైల్ కంపెనీలకు అద్దెకు ఇవ్వడం ద్వారా భారీ మొత్తాన్ని ఆర్జించవచ్చు. మీ ఇంటిపై మొబైల్ టవర్ ను ప్రారంభించిన తర్వాత మీకు నెల నెలా మొబైల్ కంపెనీ నుంచి రాబడి ఉంటుంది. అయితే మీరు మీ ఇంటిపై మొబైల్ టవర్ ను ఏర్పాటు చేయాలంటే మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ టెర్రస్ ను మొబైల్ టవర్(Mobile Tower) ఏర్పాటు చేయడానికి అద్దెకు ఇవ్వాలి అనుకుంటే మీరు నేరుగా మొబైల్ కంపెనీని లేదా టవర్ ఆపరేటింగ్ కంపెనీలను సంప్రదించవచ్చు.

హోర్డింగ్స్ లేదా బ్యానర్లు :

మీరు ఉండే డాబా మీ ఊరిలో ముఖ్యమైన ప్రదేశంలో దూరం నుంచి కనిపించే విధంగా లేదా రోడ్డు ప్రక్కన ఉన్నట్లయితే, మీరు మీ టెర్రస్ ని బ్యానర్స్ లేదా హోర్డింగ్ల(Holdings)ను అమర్చుకునేందుకు అద్దెకు ఇవ్వడం ద్వారా మంచి ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు. మీరు యాడ్ ఏజెన్సీ(Agencies)లను సంప్రదించడం ద్వారా అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాత మీ ఇంటి పై హోర్డింగ్లను లేదా బ్యానర్లను ఏర్పాటు చేస్తారు. మీరు ఉండే ఏరియాను బట్టి మీకు అద్దెను చెల్లిస్తారు.

Leave A Reply

Your email address will not be published.