MakeUp Tips : మేకప్ తో రెట్టింపు సౌందర్యం మీ సొంతం.. మరి జాగ్రత్తలు తీసుకోకపోతే తర్జనభర్జనే

Telugu Mirror : ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో మేకప్(MakeUp) భాగమైంది.స్త్రీలు కూడా మేకప్ చేసుకోవడానికి ఉత్సాహం చూపుతుంటారు. మేకప్ వేయాలంటే ముందుగా మనం జాగ్రత్త తీసుకునేది మేకప్ ప్రోడక్ట్స్ గురించి. అవి వారి చర్మానికి సెట్ అవుతాయో లేదో చూసుకుని కొంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు(Precautions) తీసుకున్నప్పటికీ ఒక్కొక్కసారి మేకప్ వేసేటప్పుడు చాలా తప్పులు జరుగుతుంటాయి .దీని వలన మేకప్ చెడిపోయే అవకాశం ఉంది.

Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్ లో SIP విధానం ..రోజుకి రూ.100 పెట్టుబడి తో కోటీ మీ సొంతం

కొన్ని సందర్భాలలో మేకప్ వేసుకున్నాక చర్మం పై దురద వచ్చే అవకాశం ఉంటుంది .మేకప్ తర్వాత ఫేస్ పై దురద(Itching) రావడం వల్ల మేకప్ చెడిపోతుంది .అటువంటి పరిస్థితిలలో మేకప్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫేస్ పై దురద ఇబ్బంది ఉండదు. ఎక్కువ సేపు మేకప్ మీ చర్మం(Skin)పై ఉంటుంది .అవి ఏమిటో తెలుసుకుందాం. మీ చర్మ తత్వాన్ని బట్టి మేకప్ ప్రొడక్ట్స్ ఎంచుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల చర్మ తత్వాన్ని బట్టి మేకప్ ప్రొడక్ట్స్(MakeUp Products) అందుబాటులో ఉన్నాయి.

Image Credit : Glaminati

కాబట్టి మీ యొక్క స్కిన్ టైపు(Skin Type) దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయండి.మీరు ఆన్లైన్లో మేకప్ ప్రొడక్ట్స్ కొనాలి అనుకుంటే వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి . లేదంటే మీ స్కిన్ టైప్ కు సరిపడనివి ఉపయోగించడం వల్ల అవి మీ చర్మంపై ఇబ్బందులను తెస్తుంది.కొంతమంది మహిళలు కంగారులో తొందరపడి ఒక లేయర్(Layer) పై మరొక కొత్త వేస్తారు .అంటే పాత మేకప్ పైన కొత్త మేకప్ వేస్తారు .ఇలా చేయడం వల్ల దురద ఆరంభం అవుతుంది. ఈ విధంగా ఎప్పుడు చేయకండి .మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే వేరే కొత్త మేకప్ వేసుకోవాలి. మేకప్ వేసుకునే బ్రష్(Brush) లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి‌.

Business Idea : టెర్రస్ పై బిజినెస్ ఐడియా.. ఇంట్లోనే ఉంటూ అధిక రాబడితో అత్యంత లాభం..

లేదంటే బ్రష్ పైన ఉండే దుమ్ము మరియు మురికి మీ చర్మంపై కూడా దుమ్ము(Dust) అంటుకునేలా చేస్తాయి అంతేకాదు బ్రష్ లు మురికిగా ఉండటం వలన ముఖంపై ఇన్ఫెక్షన్(Infection) వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మేకప్ వేసుకున్న వెంటనే బ్రష్ ను శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి.ప్రతిరోజు మేకప్ వేసుకునేవారు మీ చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మేకప్ తో పాటు చర్మానికి పోషణ ఇవ్వడం కూడా అవసరమని గుర్తించుకోవాలి.రాత్రిపూట నిద్రపోయే ముందు మీ ఫేస్ పై ఉన్న మేకప్ లో పూర్తిగా తొలగించడం మర్చిపోకండి మేకప్ ఉంచుకొని నిద్రపోవడం వలన వివిధ రకాల చర్మ సమస్యలు(Skin Problems) వచ్చే అవకాశం ఉంది.కాబట్టి మేకప్ వేసుకునేవారు ఇటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు మేకప్ వేసుకున్నాక ఎటువంటి  ఇబ్బంది ఉండదు.

Leave A Reply

Your email address will not be published.