3 Best Schemes For Farmers: రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మూడు పథకాలు, వీటి వల్ల ఇంత ప్రయోజనమా!

3 Best Schemes For Farmers: పేద మరియు వెనకపడిన తరగతులకు ప్రభుత్వం పథకాలను మరియు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతుండగా, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రైతులకు సంబంధించిన పథకాలు కూడా ఉన్నాయి వాటి వల్ల కూడా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే రైతులకు ఎక్కువగా ఉపయోగపడే ఒక మూడు పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పీఎం కిసాన్ ఫసల్ బీమా యోజన (PM Kisan Fasal Bima Yojana)

2016లో కిసాన్ ఫసల్ బీమా యోజన పేరుతో పంటల బీమా పాలసీని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రారంభించారు. ఈ పథకం రైతులకు అనేక కొత్త ప్రయోజనాలను అందిస్తుంది. భారీ వర్షాలు, వడగళ్ల వానలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులు ఈ పథకం ద్వారా పరిహారం పొందుతారు.

మరి ఈ పథకం యొక్క ప్రత్యేకతలు ఏమిటి?

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) ప్రణాళికలో, ఈ పరిస్థితులన్నీ స్థానిక విపత్తులుగా పరిగణించి పరిహారం అనేది నిర్ణయిస్తారు. కోత కోసిన తర్వాత వర్షాలు లేక ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా 14 రోజుల్లో నష్టపోయినా రైతులకు పరిహారం అందజేస్తారు. ఈ పథకం యొక్క ప్రయోజనాలలో తక్కువ ప్రీమియం, సులభమైన దరఖాస్తు ప్రక్రియ మరియు త్వరిత పరిహార చెల్లింపులు ఉంటాయి.

 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan samman nidhi yojana)

ఫిబ్రవరి 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులు వార్షికంగా రూ.6000 అందుకుంటారు. ఏప్రిల్ నుండి జూలై వరకు, ఆగస్టు నుండి నవంబర్ వరకు మరియు డిసెంబర్ నుండి మార్చి వరకు విడతల వారీగా ఎకరాకు రూ. 2,000 చొప్పున కేంద్రం ఆర్థిక సహాయాన్ని రైతులకు అందిస్తోంది. దీని కోసం అర్హత ఉన్నవారు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైటుకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు.

కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ (Kisan Credit Card)

1998లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం చేసుకునేందుకు ఖర్చులను దృష్టిలో పెట్టుకొని తగిన రుణాన్ని అందించడానికి కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ ను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రాసెసింగ్ ఫీజు (Processing fee) , ఫిజికల్ పేపర్లు లేకుండా రూ. 1.60 లక్షల వరకు రుణం పొందవచ్చు. మీరు అర్హులైతే, రూ. 1.60 లక్షలు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి. ఇతర వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేట్లు అత్యంత తక్కువగా ఉంటాయి. కేంద్రం దాదాపు 4% వడ్డీ రాయితీని అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు బ్యాంకు ఆధారంగా మారవచ్చు. దీని వల్ల ఇప్పటి వరకు 2.5 కోట్ల మంది లబ్ది పొందారు.

3 Best Schemes For Farmers

Comments are closed.