ABS Technology : సరికొత్తగా ఏపీలో ఏబీఎస్‌ టెక్నాలజీ, ఆ రూట్ లోనే.. 

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ సెక్షన్ లో ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నల్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌) అమల్లోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

ABS Technology : కేంద్ర ప్రభుత్వంలోని అతిపెద్ద వ్యవస్థల్లో రైల్వే శాఖ ఒకటి. ప్రతిరోజూ, లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే , ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ కూడా అనేక చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటోంది. కొత్త కొత్త టెక్నాలజీలను రైల్వే వ్యవస్థలో ఉపయోగిస్తున్నారు. తాజాగా,  ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికులకు రైల్వే అధికారులు శుభవార్త అందించారు. అది ఏంటి అంటే?

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ సెక్షన్ లో ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నల్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌) అమల్లోకి వచ్చింది. గన్నవరం-నూజివీడు మధ్య 22 అత్యాధునిక ఆటోమేటిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 21 కిలోమీటర్ల మేర ఆటోమేటెడ్ బ్లాక్ సిస్టమ్ అమలు చేయడం జరిగింది.

అత్యంత రద్దీగా ఉండే గన్నవరం-నూజివీడు మార్గంలో రూ.31.81 కోట్లతో ఈ ఏబీఎస్ వ్యవస్థను నిర్మించారు. కొత్త సిగ్నలింగ్ వ్యవస్థ లో ప్రయాణికులు మరియు గూడ్స్ రైళ్లు మరింత సాఫీగా మరియు సురక్షితంగా ప్రయాణించవచ్చు. గన్నవరం, పెదవుటపల్లి, తేలప్రోలు, నూజివీడు స్టేషన్లలో రైల్వే అధికారులు ఈ ఏబీఎస్ పరికరాలను అమర్చారు. అవి ప్రెజర్ తో కూడిన ప్రీకాస్ట్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు.

ABS Technology

మరోవైపు, విజయవాడ డివిజన్‌లోని వేటపాలెం రైల్వే యార్డులో ఇప్పుడు WCMS (వెల్డబుల్ కాస్ట్ మాంగనీస్ స్టీల్) అందుబాటులో ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ, గూడూరు సెక్షన్లలో రద్దీ ఎక్కువగా ఉంది. అయితే ఈ మార్గంలో తొలిసారిగా వేటపాలెం వద్ద డబ్ల్యూసీఎంఎస్‌ను నిర్మించారు. ఈ ఏబీఎస్ రైల్వే సిగ్నలింగ్‌, రైల్వే లైన్లు, బ్లాక్‌లుగా విభజిస్తుంది. ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ని ఉపయోగించి ఈ బ్లాక్‌ల మధ్య రైళ్లు నడుస్తాయని భావిస్తున్నారు.

సాధారణంగా  ట్రాక్‌పైకి  క్రాస్ అయ్యేటప్పుడు, ట్రైన్  తక్కువ వేగంతో నడపాలి. వేగం పెరిగితే పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. అయితే, ఈ కొత్త విధానంతో, రైలు క్రాసింగ్ వద్ద 130 కిమీ/గం వేగంతో ట్రాక్‌లను మార్చవచ్చు. స్టేషన్ పొడవునా టర్నింగ్ పాయింట్లు..వాటికి జాయింట్‌లను కలిగి ఉండేవి. ఈ WCMS టెక్నాలజీ ద్వారా  తక్కువ దూరంలోనే  క్రాసింగ్ ఉంటుంది. ఇవి మాంగనీస్‌ వి కాబట్టి, రైలు ట్రాక్‌లను మరింత వేగంగా పట్టాలు మారుతుంది.

ఈ కొత్త టెక్నాలజీతో రైల్వే ట్రాక్ క్రాసింగ్‌లలో మార్పుల వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉండదని, సమయానికి ప్రయాణికులు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అప్‌డేటెడ్ టెక్నాలజీ ప్రయాణికులకు మరిన్ని సేవలను అందిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం, ఈ టెక్నాలజీ వల్ల  విజయవాడ డివిజన్‌కు ఆదాయాన్ని కూడా  పెంచుతుందని భావిస్తున్నారు.

ABS Technology in Ap

Comments are closed.