AP Arogyasri Services : ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. ఆసుపత్రి నెట్ వర్క్ వెల్లడి.  

పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించే ఆరోగ్యశ్రీ పథకం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కష్టాల్లో పడింది. వచ్చే శనివారం నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి.

AP Arogyasri Services : ఆరోగ్యశ్రీ (Arogyasri) అనేది రాష్ట్రంలోని నిరుపేద రోగులకు భరోసాను అందించే ఒక  అద్భుతమైన పథకం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆయన ప్రారంభించిన విధానాన్ని అమలు చేస్తూనే ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ జరుగుతోంది. స్వల్ప ఆదాయ కుటుంబాలు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఉచిత చికిత్స పొందుతున్నాయి. అయితే, ఏపీలో ఆరోగ్యశ్రీ చికిత్సలు నుంచి శనివారం బంద్ చేస్తున్నట్లు ఆసుపత్రుల నెట్ వర్క్ ప్రభుత్వానికి లేఖ రాసింది.

పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించే ఆరోగ్యశ్రీ పథకం ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఇప్పుడు కష్టాల్లో పడింది. వచ్చే శనివారం నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు (Arogyasree Network Hospitals) ప్రకటించాయి. ఈ మేరకు మే 4 నుంచి ఆరోగ్యశ్రీ కింద నగదు రహిత సేవలను నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రభుత్వానికి తెలియజేశాయి. బకాయిలను వెంటనే చెల్లించాలని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో (Arogyasri Trust CEO) కు లేఖ రాశారు.

AP Arogyasri Services

ఎన్నిసార్లు విన్నవించినా బకాయిలు చెల్లించలేదని.. దీంతో ఆసుపత్రులు అప్పులపాలయ్యాయని ఆసుపత్రి నెట్ వర్క్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆరోగ్య సేవల (Health Services) ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు లేఖలో తెలిపాయి.

ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో ఈహెచ్ ఎస్ (EHS) విధానంలో ఉద్యోగులకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలను ఈ నెల 4వ తేదీ నుంచి నిలిపివేస్తామని హెచ్చరించారు. బకాయిల చెల్లింపుపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో చెప్పారు.

గత ఆరు నెలలుగా చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంపై ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ (AP Specialty Hospitals) అసోసియేషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ మేరకు నెట్ వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు లేఖ పంపారు. మే 4 నుంచి నగదు రహిత చికిత్సలు నిలిపివేయనున్నట్లు వారు స్పష్టం చేశారు. గత పదేళ్లుగా చికిత్స ఫీజు చెల్లింపులో లోపాలు, ధరలు పెరగకపోవడంపై ఆరోగ్యశ్రీ గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. పదేళ్ల కిందటి ధరలతోనే ఇప్పటికీ చికిత్సలు చేస్తున్నట్టు, సర్జరీల చార్జీలు పెంచాలని కోరింది.

AP Arogyasri Services

Comments are closed.