AP Weather Update : ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.

ఏపీలో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నట్లు ఐఎండీ తెలిపింది. అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటికి వెళ్లాలని హెచ్చరించింది.

AP Weather Update : ఏపీలో వాతావరణంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటుంది. మే నెల అంటే ఎండలు ముదిరి వేడికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవ్వాలి. కానీ, ఏపీలో ఒక పక్క ఎండలు కొడుతూనే మరోపక్క వర్షాలు పడుతున్నాయి. వాతావరణంలో కొత్త కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత వారం నుండి వాతావరణం చల్లగా మారింది.

నగరంలో ఉండే ప్రజలు ఎండ నుండి ఉపశమనం పొందిందని భావించగా పల్లె ప్రజలు అకాల వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అయితే, ఏపీ ప్రజలకు మళ్ళీ వర్ష సూచన కనపడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) వెల్లడించింది. ఇది తుపానుగా మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ విభాగం అంచనా వేస్తోంది.

ఏపీలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు.

ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) అంచనా వేసింది. భారత వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు ఉత్తర, దక్షిణ బీచ్‌ల దగ్గర అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించి శుక్రవారం ఉదయం బంగాళాఖాతంలో బలపడనుంది. శనివారం సాయంత్రం నాటికి తుఫానుగా మారి బంగాళాఖాతం మీదుగా ఈశాన్య మరియు వాయువ్య దిశగా కదులుతుందని IMD అంచనా వేసింది.

AP Weather Update

దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై (Andhra Pradesh) పడుతుందని ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉంటే, ఈ తుఫాన్ మరింత తీవ్రంగా మారితే ఒమన్ సూచించినట్లుగా దానికి ‘రెమాల్’ అని పేరు పెడతారు. టైఫూన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. ఆదివారం వరకు నీళ్లలో చేపలు పట్టవద్దని మత్స్యకారులను ఆదేశించారు. ఈ నెల 25న పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ మధ్య తుపాను తీరం చేరుతుందని ఐఎండీ పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతిలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని IMD విభాగం వెల్లడించింది.

శుక్ర, శనివారాల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనివాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైనప్పుడు మాత్రమే బయటకు వెళ్లాలని హెచ్చరించింది.

AP Weather Update

Comments are closed.