school holidays AndhraPradesh 2024: వేసవి సెలవులు ఎప్పటి నుండో తెలుసా? దాదాపు 50 రోజులు సెలవులు

పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 25న ప్రారంభమవుతాయి. అయితే, ఈ వేసవి సెలవులను జూన్ 13, 2024 వరకు పొడిగించే అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరం పాఠశాలలకు దాదాపు 50 రోజులు వేసవి సెలవులు ఉండే అవకాశం ఉంది.

school holidays AndhraPradesh 2024: ఎండలు మండుతున్నాయి. భానుడు భగ్గుమంటున్నాడు. మరి కొన్ని రోజులు అయితే ఎండ తీవ్రత ఇంకా పెరుగుతుంది. ఈ ఎండల వల్ల జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి రోజు రోజుకు పెరుగుతుండడంతో పిల్లలు, పెద్దలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వేడి వల్ల పిల్లలు స్కూల్స్ లో కూడా కూర్చోలేకపోతున్నారు.

మార్చి 18 నుంచి ఒంటి పూట బడులు

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి వివిధ యాజమాన్యాలు పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ గతంలో ప్రకటించింది. అదనంగా, ఒంటి పూట పాఠశాలలు ఉదయం 7.45 నుండి 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

దాదాపు 50 రోజులు సెలవులు

పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 25న ప్రారంభమవుతాయి. అయితే, ఈ వేసవి సెలవులను జూన్ 13, 2024 వరకు పొడిగించే అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరం పాఠశాలలకు దాదాపు 50 రోజులు వేసవి సెలవులు ఉండే అవకాశం ఉంది.

ఎప్పుడూ మే నెలల్లో ఉండే ఎండలు ఈసారి మర్చి నెలలోనే భగ్గుమంటున్నాయి. రెండు నెలల ముందే వేడి విపరీతంగా ఉంది. ఏప్రిల్ నెలలో ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ముందు గానే వేసవి సెలవులు ప్రకటించాలని అనుకుంటుంది.

ఒంటి పూట బడులు ఈ నెల 15న మొదలయిన విషయం మనకి తెలిసిందే. పదవి తరగతి పరీక్షలు కూడా నిన్ననే ప్రారంభం అయ్యాయి. ఇక అటు ఏపీ లో ఒంటి పూట బడులు నిన్న ప్రారంభం అయ్యాయి. అయితే, ఏప్రిల్ 24నుండి స్కూళ్లకు వేసవి నెలవులు ప్రారంభం కానున్నాయి.

గత సంవత్సరం వేసవి సెలవులు..

పోయిన సంవత్సరం స్కూల్ పిల్లలకు ఏప్రిల్ 25 నుండి జూన్ 11 వరకు సెలవులు ఇచ్చారు. మరి ఈ సంవత్సరం ఏప్రిల్ 24 నుండి జూన్ 13 వరకు సెలవులు ఇవ్వనున్నారు. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఏడాది వేసవి సెలవులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఆంధ్రలో పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఈ నెల 18,19,20,22,23,26,27,28,30 రోజుల్లో ఏపీ పరీక్షలు నడుస్తాయి. పదవ తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పరీక్షలు జరుగుతాయి కాబట్టి పరీక్షలు అయ్యేంత వరకు ఆ కేంద్రాల్లో సెలవులు ఇచ్చారు. ఇక పదవ తరగతి పిల్లలకు 50 నుండి 60 రోజుల వరకు సెలవులు ఉండనున్నాయి.

school holidays AndhraPradesh 2024

 

 

 

 

 

 

Comments are closed.