Cheif Ministers Salary: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాల ఎంతో తెలుసా?

Telugu Mirror: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్య మంత్రి గా చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu)  ఇంకా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీ ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు. అన్ని హామీలను నెరవేన్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే, మరి వీరి యొక్క వేతనాలు ఎంతో తెలుసా? ఇతర సౌకర్యాలు ఏమి కల్పిస్తారు? వీరి జీతం ఎంత ఉండవచ్చని మీరు భావిస్తారు? ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దేశంలో అందరి ముఖ్యమంత్రులకీ జీతాలు (Salaries) ఒకేలా ఉండవు. ఆయా ప్రభుత్వాల ముఖ్యమంత్రుల నిర్ణయం ప్రకారం ఇది మారుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా జీతంతో పాటు ముఖ్యమంత్రిగా జీతం కూడా తీసుకుంటున్నారు. అతని ఇతర అలవెన్సులతో పాటు, మొత్తం రూ.3,35,000 తీసుకుంటారు. సాధారణంగా వీరికి బస, కాన్వాయి, సెక్యూరిటీ తో పాటు దేశ విదేశాల్లో పర్యటన చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. హెలికాఫ్టర్లు కూడా అందుబాటులో ఉంచుతారు.

 

Also Read: Hyd To Tirupati Special Package: హైదరాబాద్ నుండి తిరుపతికి ప్రత్యేక ప్యాకేజ్, వివరాలు ఇవే..!

అదేవిధంగా, AP ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా తన జీతం ప్రభుత్వం ఇతర అలెవెన్సులతో పాటు కొంత అదనపు ఆదాయం పొందుతారు., అతను దాదాపు రూ. 3 లక్షలు వరకు అందుకుంటారు. లోకేష్‌తో సహా ఏపీలో చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేసిన మిగతా మంత్రులందరికీ ఇదే మొత్తం దక్కుతుంది.

ఇక తెలంగాణ విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి కి దేశంలోనే అధిక వేతనం తీసుకుంటున్నారు. ఆయన దాదాపు రూ.4.1 లక్షలు తీసుకుంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాల కంటే రేవంత్ రెడ్డి (Revanth Reddy) అత్యధిక వేతనం తీసుకుంటున్నారు.

Comments are closed.