Extra Charges : ఎన్నికల వేళ కొత్త కష్టాలు, మరోసారి ఛార్జీల మోత!

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ ఇళ్లకు తిరిగే ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రత్యేక బస్సులంటూ అధిక ధరలు వసూలు చేస్తున్నారు.

Extra Charges:  రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఎన్నికల కోలాహలం నెలకొంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీ ఏపీ, తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం సొంతూర్లు వదిలేసి నగరానికి వచ్చిన ప్రజలు, ఓటేసేందుకు ఊళ్లకు బయల్దేరుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ (Hyderabad) నుంచి ఏపీ (Andhra Pradesh) లోని సొంతూర్లకు పయనమవుతున్న వారికి బస్సు ఛార్జీలు (Bus Charges) చుక్కలు చూపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ ఇళ్లకు తిరిగి వెళ్లే ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రత్యేక బస్సులంటూ అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ప్రత్యేక బస్సులతో పాటు సాధారణ బస్సుల్లో కూడా ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.

సాధారణంగా జేబీఎస్ (JBS) నుంచి కరీంనగర్ (Karimnagar) కు ఎక్స్ ప్రెస్ ధర రూ.230. కానీ ఆర్టీసీ సిబ్బంది మాత్రం రూ.280 వసూలు చేస్తున్నారు. ప్రత్యేక బస్సులు అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. కరీంనగర్ (Karimnagar) రూట్లో సిటీ బస్సులు నడుపుతూ ఒక్కో ప్రయాణికునికి రూ.410 చొప్పున వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు.

TSRTC New Buses 2024

Also Read:TSRTC Offer : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఆ చార్జీలు మినహాయింపు.

బస్సులపై ప్రత్యేకమైన బస్ బోర్డులు లేవు. తీరప్రాంత బస్సులో ఎక్కిన తర్వాత, ఇది ప్రత్యేకమైన బస్సు అని వారు పేర్కొంటూ అధిక టిక్కెట్లు డిమాండ్ చేస్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఫీజుల పెంపు (fees increase) పై ఆర్టీసీ అధికారులను ప్రశ్నించగా ప్రత్యేక బస్సుల్లో వసూలు చేస్తున్నామని వివరించారు. ప్రత్యేక బస్సులు మినహా ఇతర బస్సుల్లో సాధారణ ఛార్జీలు వసూలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

తిరుమలగిరి (Tirumalagiri) లో జేబీఎస్ నుంచి కరీంనగర్ (karimnagar) వెళ్లే బస్సులో ఓ ప్రయాణికుడు ఎక్కాడు. అతను టికెట్ తీసుకున్నాడు, కండక్టర్ అతని దగ్గర రూ.280 వసూలు చేసాడు . ఇదేమిటని ప్రశ్నించగా, చార్జీలు పెంచారని వివరించారు. ఈ బస్సు సాధారణ ఎక్స్ ప్రెస్ లాగా స్టాపు ఉన్న చోట ఆగింది. ప్రత్యేక బస్సు అయితే నాన్ స్టాప్ ఉంటుందిగా అని ప్రయాణికులు ప్రశ్నించారు.

Comments are closed.