Finished Election Polling: తెలుగు రాష్టాల్లో ముగిసిన పోలింగ్.. ఓటింగ్ లో పాల్గొన్న ప్రముఖ హీరోలు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఏపీలో పోలింగ్ 55.49 శాతానికి చేరుకుంది. ఈ పోలింగ్ లో ప్రముఖ హీరోలు పాల్గొన్నారు.

Finished Election Polling: నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఓటర్లు పోలింగ్ బూత్ లకు భారీగా తరలి రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఏపీలో పోలింగ్ 55.49 శాతానికి చేరుకుంది. గ్రామీణం నుంచి పట్టణాల వరకు పోలింగ్‌ బూత్‌ (Pooling Booth) లు ఉత్సాహంతో నిండిపోయాయి. చాలా మంది యువకులు తొలిసారిగా ఓటు వేశారు.

మధ్యాహ్నం సమయానికి పోలింగ్ బూత్‌లు వేలాది మంది ఓటర్లతో కిక్కిరిసిపోయాయి. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినా ఓటర్లు లెక్కచేయని పరిస్థితి కనిపిస్తోంది.

ప్రముఖ సినీనటుడు మహేష్ బాబు (Mahesh Babu) , ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ (Samatra Sirodakhar) ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. హైదరాబాద్‌ (Hyderabad) లోని జూబ్లీహిల్స్ (Jubliee Hills) పబ్లిక్ స్కూల్‌లో ఓటు వేశారు. జూబ్లీ క్లబ్‌లో నటుడు రామ్ చరణ్ (Ram Charan) , ఆయన భార్య ఉపాసన (Upasana) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత, ప్రతి ఒక్కరినీ ఓటు వేయమని ప్రోత్సహించానని, ఓటు వేయడాన్ని భారంగా చూడవద్దని, బాధ్యతగా భావించాలని రామ్ చరణ్ అన్నారు. ఇంట్లో ఉన్న యువత ఓటు వేయాలి అని రామ్ చరణ్ తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ (Bala Krishna) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురంలోని ఓ పోలింగ్ స్టేషన్ లో ఓటు వేశారు. హిందూపురం నుంచి బాలకృష్ణ వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఓటు వేసిన అనంతరం బాలకృష్ణ దంపతులు తమ వేళ్లకు ఉన్న సిరా గుర్తులను చూపించారు.

సినీ హాస్యనటుడు బ్రహ్మానందం ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీలో ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించారు. ఓటర్లకు ఏం చెబుతారు? అని వారు ప్రశ్నించారు. దానికి బ్రహ్మానందం స్పందిస్తూ, ఓటర్లకు అప్పీల్ చేసేది ఏముందమ్మా గంటలో మొత్తం అయిపోతుంది… ప్రతి ఒక్కరు ఓటు హక్కును బాధ్యతగా భావించాలన్నారు.

Comments are closed.