Foot Board Journey in Train: రైలులో ఫూట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే

చాలా మంది ప్రయాణికులు రైలులో ఎక్కువ దూరం ప్రయాణిస్తారు. సీట్ దొరికితే ఓకే కానీ సీట్ దొరకకపోతే ఇబ్బంది పడుతూ ప్రయాణిస్తారు.

Foot Board Journey in Train: నిత్యం వందల కిలోమీటర్లు ప్రయాణించే రైళ్లలో కేవలం రెండు లేదా మూడు సాధారణ బోగీలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి మహిళల కోసం కేటాయించబడింది. అందులో రెండు మూడు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు వందల కి.మీ. ప్రయాణిస్తూ ఉంటారు. సీటు ఉంటె సీటులో కూర్చొని ప్రయాణం చేస్తారు. లేదంటే, రెస్ట్‌రూమ్‌ల దగ్గర, జనాల కూర్చున్న సీట్ల క్రింద ఎక్కడో ఒకచోట కూర్చొని ఎడ్జస్ట్ అవుతారు. పుట్ బోర్డు ప్రయాణం (Foot Board Journey) ప్రమాదాల గురించి హెచ్చరించినప్పటికీ చాలా మంది యువకులు హెచ్చరికలను పట్టించుకోలేదు.

చాలా మంది ప్రయాణికులు రైలులో ఎక్కువ దూరం ప్రయాణిస్తారు. సాధారణ బోగీలు (Ordinary Compartments) నిండిపోతాయి. అదేవిధంగా ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణికులు వేల కి.మీ. ప్రయాణించడానికి సీట్ ఉంటే, కొంతమంది ప్రయాణికులు ట్రైన్ డోర్స్ దగ్గర నిలుచొని ప్రయాణిస్తారు. పుట్ బోర్డ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది రైలు నుండి పడి మరణించిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ మరింత భద్రతా చర్యలను అమలు చేసింది. ఫుడ్ బోర్డు దగ్గర కూర్చొని ప్రజలు ప్రయాణించకుండా రైల్వే పోలీసులు చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. అయితే రైలులో ప్రయాణించే కొందరు యువకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

image credit: hindustan times, eRail.in

Also Read: https://telugumirror.in/news/india-news/free-wifi-facility-in-railway-station/

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రెండు రైలులో సాధారణ కోచ్‌ల సంఖ్యను ఐదుకు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్స్‌ప్రెస్ మరియు సూపర్‌ఫాస్ట్ రైళ్ల (Super Fast Train) లో రెండు సాధారణ బోగీలు మాత్రమే ఉంటాయి. ఎన్నో రైళ్లు దేశవ్యాప్తంగా తిరుగుతూనే ఉన్నాయి. జనరల్ బోగీలు, తొక్కిసలాటలు, ఫుట్‌బోర్డ్ ప్రయాణం వారికి సర్వసాధారణం. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments are closed.