Gas Cylinder Expiry Date Check: గ్యాస్ సిలిండర్ పై గడువు తేదీని గుర్తించడం ఎలా? ఇప్పుడే తెలుసుకోండి

వంట గ్యాస్‌తో వంట చేసేటప్పుడు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం సురక్షితంగా ఉంటాము. గ్యాస్ సిలిండర్ పై గడువు తేదీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Gas Cylinder Expiry Date Check: ఒకప్పుడు వంట గ్యాస్ అంటే ఎవరికీ తెలీదు. అందరు కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకునేవారు. ఉజ్వల యోజన పథకం కింద గ్రామీణ మహిళలకు ఎల్పీజీ సిలిండర్లు అందించింది. దాంతో,మహిళల పని సులభం చేసింది. గ్యాస్ సిలిండర్ వాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. గ్యాస్ సిలిండర్ పై కూడా గడువు తేదీ ఉంటుందని మీకు తెలుసా? పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

వంట గ్యాస్ తో జాగ్రత్తలు
వంట గ్యాస్‌తో వంట చేసేటప్పుడు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం సురక్షితంగా ఉంటాము. చాలా మంది మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ల నిర్వహణ లేదా ఇతర సిలిండర్ సంబంధిత సమస్యల గురించి అంతగా తెలియదు. ఒక్కో వంట గ్యాస్ సిలిండర్‌కు గడువు తేదీ ఉంటుందని చాలా మందికి తెలియదు. అందుకే ఎక్కువగా సిలిండర్‌లలో లీక్‌లు సంభవించి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.

ప్రతి సిలిండర్‌ను పట్టుకోవడానికి పైన ఒక రౌండ్ గ్రిప్ ఉంటుంది. ఇది సిలిండర్‌తో సపోర్టెడ్ గా ఉండే మూడు ప్లేట్‌లను కలిగి ఉంటుంది. ఈ ప్లేట్లు లోపలి భాగంలో స్పష్టంగా అంకెలు వేసి ఉంటాయి. ఈ మూడింటిలో ఒకటి సిలిండర్ గడువు తేదీని కలిగి ఉంటుంది. ఇది సంవత్సరం మరియు నెల గురించిన వివరాలను కలిగి ఉంటుంది.

LPG Cylinder price increase: The government has increased gas prices, increase only on commercial cylinders.
Image Credit : ABP Live- ABP News

గ్యాస్ సిలిండర్ గడువు తేదీ

ఇప్పుడు గడువు తేదీని ఎలా కనిపెట్టాలో చూద్దాం. సిలిండర్ పైన ఉన్న మెటల్ ప్లేట్లలో ఒకదాని లోపలి భాగంలో ఆల్ఫాన్యూమెరిక్ అక్షరాలతో ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఇంట్లో A 24 సిలిండర్‌ని కలిగి ఉన్నారనుకోండి. ఇందులో A అనే సంఖ్య జనవరి నుండి మార్చి నెలలను సూచించగా 24 అనేది 2024 సంవత్సరాన్ని సూచిస్తుంది. ఇది సంవత్సరం మొదటి త్రైమాసికం చివరిలో సిలిండర్ గడువు ముగుస్తుందని అర్ధం. B అంటే ఏప్రిల్-జూన్, C అంటే జూలై-సెప్టెంబర్ మరియు D అంటే అక్టోబర్-డిసెంబర్ అని అర్ధం.

గడువు ముగిసాక ఏం చేస్తారు?

గడువు ముగిసిన సిలిండర్లు బాటిలింగ్ కేంద్రానికి తరలిస్తారు. బాట్లింగ్ వద్ద, LPG గ్యాస్ సిలిండర్ డ్యూరబిలిటీ చెక్ చేస్తారు. హైడ్రోస్టాటిక్ టెస్టింగ్, బర్స్ట్ టెస్ట్‌లు, అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ టెస్ట్‌లు, ఇంపాక్ట్ టెస్ట్‌లు మరియు ప్రెజర్ సైక్లింగ్ టెస్ట్‌లు చేస్తారు.
అన్ని టెస్టులు పూర్తి అయిన తర్వాత LPG కంపెనీలు ఆ సిలిండర్లను వేరు చేసాక రీసెట్ తేదీని బాట్లింగ్ సెంటర్లలో ముద్రిస్తాయి.

Gas Cylinder Expiry Date Check

Comments are closed.