Holidays Extended in Andhra Pradesh: విద్యార్దులకు గుడ్ న్యూస్, సెలవులు పొడిగింపు, రీఓపెన్ ఎప్పుడంటే?

2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు వేసవి సెలవులు దాదాపు ముగిశాయి. సెలవుల పొడిగింపు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Holidays Extended in Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో వేసవి ముగిసింది. భానుడి భగ భగలు తగ్గిపోయాయి. జూన్ నెల వచ్చిందంటే దేశవ్యాప్తంగా వర్షాలు మొదలవుతాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తల్లిదండ్రులు (Parents) కూడా తమ పిల్లలను బడికి పంపేందుకు సిద్ధమవుతున్నారు. కానీ పిల్లలు మాత్రం స్కూల్స్ కి సెలవులు ఇస్తే బాగుండు అని అనుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో స్కూల్స్ కి సెలవులు పొడిగించారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు వేసవి సెలవులు దాదాపు ముగిశాయి. పాఠశాలలకు అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ. మరో నాలుగు రోజుల్లో సెలవులు ముగియనున్నాయి. సెలవులు పొడిగిస్తూ విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి, 2024-25 విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కావాల్సి ఉంది. వచ్చే బుధవారం తరగతులు ప్రారంభమవుతాయి.

ఇక, ఏపీలో ఇప్ప‌టికే ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల (Assembly Elections) ఫ‌లితాల‌ను బ‌ట్టి టీడీపీ అఖండ విజయం సాధించింది. నారా చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం త్వరలో ఏర్పాటు కానుంది. దీనికి గాను అమరావతిలో కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే వేసవి సెలవుల (Summer Holiddays) నేపథ్యంలో అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

school holidays AndhraPradesh 2024

Also Read: Bakrid Holidays: బక్రీద్ సందర్భంగా జూన్ 17 సెలవు, మరి జూన్ 25న ఎందుకు సెలవంటే?

దీంతో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ (Principal Secretary Praveen Prakash) కు టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ వినతిపత్రం అందించి ఈనెల 12వ తేదీ కాకుండా 13న పాఠశాలలు తెరవాలని వినతి చేశారు. పాఠశాల పునఃప్రారంభ తేదీని వాయిదా వేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయాలని చంద్రబాబు కోరారు. దీంతో ఏపీలో పాఠశాలల పునఃప్రారంభ తేదీ మారే అవకాశం ఉంది. అయితే, విద్యా ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు 50 రోజుల వేసవి సెలవులను ప్లాన్ చేసింది.

ఇంకా, చంద్రబాబు ప్రమాణ స్వీకారం తరువాత, పాఠశాలలు మరుసటి రోజు జూన్ 13 న పునఃప్రారంభం కావాల్సి ఉంది. అదనంగా, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ (Rayalaseema) తో పాటు కోస్తాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల్లో కురుస్తున్న వర్షాల తీవ్రతను బట్టి పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిస్తే జిల్లాల కలెక్టర్లు పాఠశాలకు సెలవులు పొడిగించే అవకాశం ఉంటుంది.

Comments are closed.