Congress Manifesto : అదిరిపోయిన కాంగ్రెస్ మేనిఫెస్టో.. ప్రతి మహిళకు ఏడాదికి రూ.లక్ష..!

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గెలుపు కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. కేంద్ర ప్రభుత్వం 'న్యాయ్‌ పత్ర' పేరిట కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విడుదల చేసింది.

Congress Manifesto : ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమంతో పాటు ప్రత్యేకించి మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ మరో హామీ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల (Lok Sabha elections) నేపథ్యంలో మహిళలకు మరో శుభవార్త చెప్పింది. లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇటీవలే మేనిఫెస్టోను (Manifesto) విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన మ్యానిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ (Congress party) పేదలకు చాలా హామీలు ఇచ్చింది.

ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయం వేదికగా దీన్ని రిలీజ్ చేశారు. ‘పాంచ్ న్యాయ్ పచ్చీస్ గ్యారంటీస్’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ ప్రకటించింది. ‘న్యాయ్‌ పిల్లర్ల’ పేరుతో 25 గ్యారంటీలను ఐదు భాగాలుగా విభజించింది. ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 25 రకాల హామీలు ఇచ్చింది. ఇందులో మహాలక్ష్మి పథకం చాలా ముఖ్యమైనది.

ఇందులో భాగంగా నిరుపేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. ఈ పథకం అమలు అయితే మహిళలు నెలకు సుమారుగా 8,000 రూపాయలు ఉచితంగా అందుకుంటారు. కాబట్టి ఈ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. తెలంగాణలో మహాలక్ష్మిని అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ గతంలో శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా 2500 రూపాయలు అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Congress Manifesto

ఈ మేనిఫెస్టోలో ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు రెట్టింపు పెంచుతామని, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల పెంపు, న్యాయమైన వేతనాలు, సురక్షితమైన పని ప్రదేశాలు, ప్రసూతి ప్రయోజనాలు మొదలైన వాటి ద్వారా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం, భారతీయ మహిళా బ్యాంకును తిరిగి ప్రారంభించడం మరియు పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013, గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం 2005 వంటి చట్టాల కఠిన అమలు లాంటి హామీలు ఉన్నాయి.

ఈ హామీని నెరవేర్చేందుకు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణలోని నిరుపేద మహిళలకు ఈ 2500 రూపాయలు అందుతాయి. అంటే కేంద్రం, రాష్ట్రంలో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తే ప్రతి నిరుపేద మహిళకు 11 వేల రూపాయలు ఉచితంగా అందుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని, కులాలు, ఉపకులాలు, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను గుర్తించి, 50% కోటా పరిమితిని తొలగిస్తామని, కేంద్ర ప్రభుత్వ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Congress Manifesto

Comments are closed.