Indian Construction Workers To Israel: ఇజ్రాయెల్ కు మోడీ సహాయం, లక్ష మంది భారతీయ నిర్మాణ కార్మికులను ఇజ్రాయెల్ కు తరలింపు

పాలస్తీనా, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా పాలస్తీనియన్ల స్థానంలో లక్ష మంది భారతీయులను ఎంపిక చేయాలియని ఇజ్రాయెల్ నిర్మాణ రంగం బావిస్తుంది దీంతో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని భారతదేశం నుంచి లక్ష మంది భవన నిర్మాణ కార్మికులని పంపవలసినదిగా ఫోన్ కాల్ సంబాషణలో కోరారు.

Telugu Mirror: పాలస్తీనా (palestine) , ఇజ్రాయిల్ (israel) యుద్ధం కారణంగా ఇజ్రాయిల్ లో కార్మికుల లోటు ఏర్పడింది, దీంతో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ని భారతదేశం నుంచి లక్ష మంది భవన నిర్మాణ కార్మికులని పంపవలసినదిగా ఫోన్ కాల్ సంబాషణలో కోరారు.

దీనిపై స్పందించిన నరేంద్ర మోడీ తక్షణముగా భారతదేశంలోని హర్యానా మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి కార్మికులను పంపవలసినదిగా అధికారులకు సూచించారు, అధికారులు ఇప్పటికే హర్యానా నుండి 3000 మంది కార్మికులను పంపించారు, ఉత్తరాఖండ్ కూడా త్వరలోనే కొంతమంది కార్మికులను పంపనున్నది.

మిగతా కార్మికులనుని ఎంపిక చేయడం కోసం ఇప్పటికే ఇజ్రాయిల్ నుంచి కొంతమంది భారతదేశానికి వచ్చారు,  డిసెంబర్ 27 నుంచి ఢిల్లీ (Delhi), చెన్నై (Chennai) నగరాల్లో సెలక్షన్ ప్రాసెస్ మొదలవనున్నది, ఈ సెలక్షన్ ప్రాసెస్ లో మరో 10 వేల మంది కార్మికులని ఎంపిక చేసి నియమించుకోనున్నారు, త్వరలోనే మరో 30000 మంది కార్మికులని కూడా నియమించనున్నట్టు తెలిపారు, ఈ ప్రక్రియ సుదీర్ఘమైనదని ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు అధికార ప్రతినిధి షే పౌజ్నర్ తెలిపారు.

 

Modi's help to Israel, lakhs of Indian construction workers migrated to Israel
image credit : abc

Also Read: Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 484 పోస్ట్ ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. centralbankofindia.co.in లో దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక బృందం మరియు కార్మికుల ఇబ్బందులను తెలుసుకునే IBA యొక్క విభాగం నాయకుడు Izchak Gurvitz గత వారం భారతదేశ పర్యటనకు నాయకత్వం వహించారు. వారు వచ్చే వారంలో వారి సమావేశంలో జట్టు సభ్యులు మరియు CEO ఇగల్ స్లోవిక్‌తో తదుపరి చర్చలు జరుపుతారు.

కార్మికుల లోటు ఇజ్రాయిల్లో ఒక్క కన్స్ట్రక్షన్ సెక్టార్లో నే కాకుండా నర్సింగ్ సెక్టార్ (Nursing sector) లో కూడా కార్మికులు అవసరం ఉంది, అందుకే ఇప్పటికే భారతదేశ కార్మికులు18,000 మంది పనిచేస్తున్న ఇంకో 30000 మంది కార్మికులుని రాబోయే నెలలో భారతదేశం నుంచి ఇజ్రాయిలుకు పంపనున్నది.

యుద్ధం కారణంగా పాలస్తీనాకీ చెందిన వేలాది ఉద్యోగలు ఒకసారి గా వారి వారి విధులకు రాజీనామా చేయడంతో ఈ కొరత ఏర్పడిందని ఇజ్రాయేల్ కి చెందిన అధికారులు తెలిపారు.

భారతదేశం నుంచే కాకుండా వేరే దేశాల నుంచి కూడా కార్మికుల కోసం ఇజ్రాయేల్ దేశం ప్రయత్నాలు చేస్తుంది.

Comments are closed.