Poultry : భారత్ లో చికెన్, కోడిగుడ్డు ధరలు పెరగడానికి శ్రీ లంక కారణమా?

దేశంలో ప్రస్తుతం పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి. గుడ్డు ధరలు శ్రీలంకకు దిగుమతులు అధిక మవడం కారణంగా పెరిగాయి.

దేశంలో పౌల్ట్రీ (Poultry) మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ (April) నుండి ఆగష్టు (August) మధ్యకాలంలో క్షీణించిన (Degenerate) పౌల్ట్రీ ధరలు తిరిగి మళ్ళీ ఊపందుకున్నాయి. హిందూ మత సంభంధ కాలాలు శ్రావణ మరియు అధిక మాసాల ముగింపు, మరియు భారతదేశం నుండి శ్రీలంకకు గుడ్డు దిగుమతులు అధికమవడం పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలు పెరుగుదలకు (to increase) కారణమయ్యాయి.

నిపుణులు అభిప్రాయం ప్రకారం చికెన్ (Chicken) మరియు గుడ్డు డిమాండ్ స్థిరంగా ఉండి, ఇలాగే ముందుకు వెళితే ఫలితంగా పండుగలు మరియు పెళ్లిళ్ల సీజన్ అక్టోబరు-డిసెంబర్ త్రైమాసికంలో (Quarterly) ధరలు పెరుగుతాయి.
ప్రధాన కోళ్ల దాణా సోయా, సోయా పంటకోత అనంతర సమయంలో ధరలు పెరగడం కూడా చికెన్ మరియు గుడ్ల ధరలపై ప్రభావం తెస్తుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.

స్పాట్ ట్రేడింగ్ డేటా వెలువరించిన (Issued) వివరాల ప్రకారం, ప్రస్తుత నెలలో కోల్‌కతా (Kolkata), బెంగళూరు (Bangalore) మరియు ఢిల్లీలో (in Delhi) ని  ఫామ్ గేట్ (Farm gate) లలో చికెన్ ధర కిలోకు రూ.92 నుండి రూ. 122 కి పెరిగాయి మరియు రిటైల్ (Retail) ధరలు కిలో రూ.250 నుండి రూ.260 గా కొనసాగింది. చికెన్ ధర ఫామ్ గేట్ వద్ద జూలై (July) మరియు ఆగష్టు (August) నెలలలో కిలోకు రూ.90 నుండి100 మరియు రిటైల్ చికెన్ ధరలు కిలోకు రూ.180 నుండి 210గా నిర్ణయించబడ్డాయి.

Poultry: Is Sri Lanka the reason for the rise in chicken and egg prices in India?
image credit : Tender Cuts

అదేవిధంగా, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై (Mumbai) మరియు బెంగళూరులలోని నగదు మరియు క్యారీ (టోకు) మార్కెట్ లో గుడ్డు (egg) ధరలు 100 గుడ్లు రూ.540 మరియు రిటైల్ షాప్ లలో రూ.650 వరకు ఉన్నాయి.

గడచిన రెండు నెలలలో, హోల్‌సేల్ (Wholesale) ధరలు 100 గుడ్లకు రూ.415 నుంచి రూ.515 మరియు రిటైల్ మార్కెట్ లో రూ.520 నుంచి రూ.550 ధర పలికాయి.

AAA రేటింగ్ కన్సల్టెంట్స్ (Consultants) వ్యవస్థాపకుడు, సలహాదారులు నిశాంత్ లక్కర్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్పత్తి దారుల స్థిరమైన లాభం అలాగే కొనుగోలుదారుల డిమాండ్ తోపాటు అక్టోబర్ (October) నెలలో సోయా పంట కోతల సీజన్ సరిగా లేకపోవడం లాంటి కారణాల వలన శ్రావణ మాసం ముగింపు తరువాత బ్రాయిలర్ చికెన్ ధరలు విపరీతంగా (విపరీతంగా )పెరిగాయని తెలిపారు.

Also Read :ప్రాణం తీసిన చికెన్ షవర్మ, అస్వస్థతతో బాలిక మృతి

సోయాబీన్ సాగులో అగ్రస్థానంలో (At the top) ఉన్న మధ్యప్రదేశ్‌లో వానలు (rains) ఆలస్యంగా కురవడం అలానే స్థిరంగా (Constantly) కాకుండా అస్థిరమైన (inconsistent) వర్షాల మూలంగా తడి నేలకు దారితీసింది, ఇది రాబోయే కోత సీజన్‌లో సోయాబీన్ యొక్క నాణ్యతను (Quality) మాత్రమే కాకుండా పరిమాణంలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. దీనిని ధృష్టిలో పెట్టుకుని ఇన్‌పుట్ ఖర్చులు అధికమవుతాయనే భావనతో పౌల్ట్రీ ఉత్పత్తిదారులు ధరలు పెంచారు.

మరో అంశం ఏమిటంటే, ఆగష్టు చివరిలో శ్రీలంకలో స్థానికంగా గుడ్ల కొరతల మధ్య ధరల హెచ్చుతగ్గులను ఎదుర్కోవడానికి గుడ్ల దిగుమతిని అనేక రెట్లు పెంచడానికి శ్రీలంక (Sri Lanka) నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో ఏర్పడిన ఫారెక్స్ మార్కెట్ సంక్షోభం పశుగ్రాసం (Fodder) దిగుమతులను ప్రభావితం చేసి, పౌల్ట్రీ సరఫరా సంక్షోభానికి దారితీసిన తరువాత, శ్రీలంక మార్చి నుండి వారి దేశంలో గుడ్డు వినియోగాన్ని తీర్చడానికి భారతదేశంపై ఆధారపడుతోంది.
CRISIL మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ డైరెక్టర్-రీసెర్చ్ పుషన్ శర్మ వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారంగా పండుగలు, పెళ్లిళ్ళ సీజన్ మొదలవడంతో, FY24 అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికంలో పౌల్ట్రీ ధరలు అధికమవుతాయని అభిప్రాయపడుతున్నారు.

Also Read :Sour Chicken: ఇంట్లోనే ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన పుల్లని జెల్ స్వీట్ చికెన్ తయారు చేయండి, కొత్త అనుభూతిని చెందండి

ఈ నెలలో గుడ్లు మరియు చికెన్ ధరలు పెరిగినప్పటికీ, పౌల్ట్రీ ధరలపెరుగుదల ప్రస్తుతం అధిక ఆహార ధరలకు మార్గం అవకపోవచ్చు.

15 రోజుల శ్రద్ధ మరియు నవరాత్రి కాలం పౌల్ట్రీ ధరలను కొంతవరకు చల్లబరుస్తుంది అని ఇండియా రేటింగ్స్ & రీసెర్చ్ చీఫ్ ఎకనామిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ అభిప్రాయంలో రాబోయే 15 రోజుల శ్రద్ద మరియు నవరాతృల సమయంలో పౌల్ట్రీ ధరలు కొంత తగ్గుముఖం పడతాయి అన్నారు. “ముఖ్యంగా టమోటా (Tomato) ధరలు విపరీతంగా తగ్గడం మరియు కొన్ని ఇతర ఆహారపదార్థాల ధరలు కూడా తగ్గడంతో ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో ఉన్నదానికంటే తగ్గే అవకాశం ఉంది.”

ఆహార ద్రవ్యోల్బణం (Inflation) జూలై నెలలో 10.6% మరియు ఆగస్టులో 9.2% గా ఉంది
వినియోగదారు ధరల సూచికలో చికెన్ మరియు గుడ్లు వరుసగా 1.23% మరియు 0.43% స్థితిని కలిగి ఉన్నాయి.

Comments are closed.