Seat Belt Mandatory In India: ఇకపై బస్సులో సీట్ బెల్ట్ తప్పనిసరి, కేంద్రానికి ఐఆర్ఎఫ్ సూచన ఇదే!

వాహనాల్లో ప్రయాణీకుల భద్రత కోసం సీట్ బెల్టులు తప్పనిసరి చేయాలి అని అంతర్జాతీయ రోడ్ సమాఖ్య (ఐఆర్ఎఫ్) భారత కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

Seat Belt Mandatory In India: ప్రస్తుతం భారతదేశంలో ఉపయోగిస్తున్న చిన్న మరియు మధ్యస్థ నాలుగు చక్రాల వాహనాలు లేదా వాహనాల్లో ప్రయాణీకుల భద్రత కోసం సీట్ బెల్టులు తప్పనిసరి చేయాలి అని అంతర్జాతీయ రోడ్ సమాఖ్య (ఐఆర్ఎఫ్) భారత కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం వల్ల అధిక సంఖ్యలో ప్రమాదాల్లో గాయపడుతున్నారు. అయితే బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాల్లో సీటు బెల్టులు ఎందుకు ఉండవని చాలా మంది అనుకుంటూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు వాటిలో కూడా సీట్ బెల్ట్‌లు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.

భారతదేశం యొక్క ప్రస్తుత రహదారులపై ప్రమాదాలు కేవలం కార్లుకు మాత్రమే కాదు పెద్ద పెద్ద వాహనాలకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. బస్సులు, లారీలు, వంటి భారీ వాహనాలు ఎప్పటికప్పుడు ప్రమాదాలకు గురవుతున్నాయి. సీటు బెల్టు లేకపోవడంతో డ్రైవర్లు, ఇతర ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని అరికట్టేందుకు బస్సులు, భారీ వాహనాల్లో సీటు బెల్టులు తప్పనిసరి చేయాలని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ కేంద్రానికి సూచించింది.

నిత్యం రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల  ప్రయాణికుల బస్సులు, పాఠశాల బస్సులు వంటి అన్ని భారీ వాహనాల్లో సీటు బెల్టులు పెట్టాలని ఐఆర్‌ఎఫ్ అధ్యక్షుడు కెకె కపిల కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు తెలియాజేశారు. ఇప్పటికే అమెరికా, చైనాలో బస్సుల్లో సీటు బెల్టులు వాడుతున్నట్లు సమాచారం. 2021 లెక్కల ప్రకారం ఆ ఏడాది అమెరికాలో బస్సు ప్రమాదాల్లో 14 మంది మాత్రమే మరణించారు.

ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోడ్ ఫెడరేషన్‌కు రాసిన లేఖలో, అనేక అభివృద్ధి చెందిన దేశాలలో కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నందున, భారీ వాహనాల్లో ప్రయాణించే వారు కూడా సురక్షితంగా ఉన్నారని, కానీ అది భారత్ లో లేకపోవడం వల్ల రోడ్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని సమాఖ్య కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. భారతదేశంలో ఇలాంటి చర్యల వల్ల స్కూల్ బస్సుల్లో కూడా పిల్లలు చనిపోతున్నారు. ఇప్పుడు కూడా బస్సులు, ఇతర పెద్ద వాహనాల్లో అవసరమైన సీటు బెల్టులను తయారు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

Seat Belt Mandatory In India

Comments are closed.