Online Job : ఆన్ లైన్ జాబ్ పేరిట కుచ్చుటోపీ , మోసపోయిన యువకుడు

Online Job: In the name of online job, Kuchutopi is a deceived young man
image credit : The Economics Times

రోజురోజుకీ ఆన్ లైన్ మోసాలు అధికమౌతున్నాయి . రోజుకొక కొత్త పద్దతిలో సైబర్ నేరగాళ్ళు తమ వలలో చిక్కిన వారిని బురిడీ కొట్టించి దోచుకుంటున్నారు . తాజాగా ఆన్ లైన్ లో ఉద్యోగం అని చెప్పి హిమాచల్ ప్రదేశ్ లో ఓ యువకుడిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది . నెలరోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తులను మోసం చేశారు సైబర్ నేరస్తులు వివరాలలోకి వెళితే .

హిమాచల్ ప్రదేశ్ లోని భవన్ లోని ఒక యువకుడు ఇంటి నుండి ఉద్యోగం చేసి ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించేందుకు సిద్ధపడ్డాడు. టెలిగ్రామ్(Tele gram) లో ఆన్ లైన్ ద్వారా ఇంటి నుండి పనిచేసేందుకు ఆఫర్ (Offer) వచ్చింది. దానిని చేయడానికి ఆ యువకుడు ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ యువకుడు కి యూట్యూబ్ (You tube) ఛానల్ ని ప్రమోట్ చేసే టాస్క్ (Task) ఇచ్చారు. అయితే వారు ఇచ్చిన టాస్క్ పూర్తి చేసినందుకు రూ. 1000 బోనస్ (Bonus) ఇస్తామని చెప్పారు. అయితే వారు చెప్పిన విధంగా చేశాడు. అతడు మొదట అయిదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత వారు ఇచ్చిన టాస్క్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతనికి 6000 రూపాయలు ఇచ్చారు. దుండగులు చెప్పిన ప్రకారం 1000 రూపాయలు బోనస్ కలిపి ఇచ్చారు. దీంతో యువకుడికి వారి మీద నమ్మకం ఏర్పడింది. అయితే వారి వలలో చిక్కుకున్నట్లు గ్రహించలేకపోయాడు. అక్రమార్కుల ఖాతాలో విడతల వారీగా 11 లక్షల రూపాయల వరకు జమ చేశాడు. అయితే తిరిగి ఎలాంటి బోనస్ రాలేదు. చివరికి తాను మోసపోయాను అని గ్రహించి క్రైమ్ పోలీస్ స్టేషన్ (Crime police station) ఉత్తర రేంజ్ ధర్మశాలలో ఆ దుండగులపై ఫిర్యాదు చేశాడు. యువకుడి ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకున్నారు.

Scam by Instagram : ఇన్స్టాగ్రామ్ యాడ్ నమ్మి రూ.10 లక్షలు కోల్పోయిన యువతి, మోసగాళ్ల నుండి రక్షణ పొందండిలా

AI అండతో దూసుకెళ్తున్న సైబర్ నేరగాళ్లు.. కొంప ముంచుతున్న “డీప్ ఫేక్” AI బాట్.

అయితే ఆ దుండగులు ప్రజలను మోసం చేసేందుకు కొత్త పన్నాగాలు చేస్తున్నారని పోలీసులు ప్రజలకు(People) తెలియజేశారు. అటువంటి సమయంలో ఇలాంటి దుర్మార్గుల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
26 రోజులలో ఇలాంటివి నాలుగు కేసులు నమోదయ్యాయి. దుండగులు వీరి దగ్గర నుంచి 44 లక్షల రూపాయల వరకు మోసం చేసి దోచుకున్నారు. ఇంట్లో ఉండి చేసుకునే ఉద్యోగం (Job) ఇప్పిస్తామని చెప్పి నలుగురిని మోసం చేశారు. నలుగురు దగ్గర నుంచి 44 లక్షల వరకు మోసం చేశారు. ఆగస్టు 18న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మొదటి కేసు నమోదు అయింది. మొదటి కేసులో 20 లక్షల రూపాయల వరకు మోసం చేశారు అని ఫిర్యాదు చేశారు. తర్వాత ఆగస్టు 30న రాజుల్ కు చెందిన వృద్ధుడు మోసపోయాడు. సెప్టెంబర్ 5న దాదా సీబాకు చెందిన ఒక యువకుడు 12 లక్షల రూపాయల వరకు మోసపోయాడు. సెప్టెంబర్ 12న భవన్ యువకుడి నుంచి 11 లక్షల రూపాయలు మోసం చేశారు.

Online Job: In the name of online job, Kuchutopi is a deceived young man
image credit : Zee News _ India. com

వీరి ఫిర్యాదు మేరకు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ప్రజలు ఆన్ లైన్ (Online) ద్వారా చేసే ఉద్యోగాలు (Job) చేయాలనుకుంటే, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే వాటిలో చేరాలి. లేదంటే వీరి లాగానే మోసపోయే అవకాశం ఉంటుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in